టీ20 వరల్డ్ కప్ 2022లో బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మెగా టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. బంగ్లాపై కూడా తన క్లాస్‌ను కొనసాగించాడు. 62 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియాకు మంచి స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అలాగే ఈ వరల్డ్‌కప్‌లోనూ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. బంగ్లాదేశ్‌తో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం గంభీర్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రెండు రోజుల క్రితమే.. కోహ్లీ కంటే సూర్యకుమార్ యాదవ్ గొప్ప బ్యాటర్ అని పేర్కొన్న గంభీర్.. ఇప్పుడు కోహ్లీని మించినోడు ఈ భూప్రపంచంలోనే లేడంటూ ఆకాశానికెత్తేశాడు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అగ్రెసివ్ మూడ్‌లో ఆడుతున్న సేపు అతనికి సపోర్ట్‌గా నిలిచాడు. అలాగే రాహుల్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ చెలరేగుతుంటే.. అతనికి స్ట్రైక్ ఎక్కువగా ఇస్తూ యాంకర్ రోల్ పోషించాడు. అతను అవుట్ అయిన తర్వాత.. గేర్ మార్చి వేగంగా పరుగులు చేశాడు. ఇలా ఒక జట్టు పరిస్థితులకు తగ్గుట్లు తనని తాను అడ్జేస్ట్ చేసుకుంటూ… ఆడిన తీరు గంభీర్‌కు బాగా నచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇలా జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఆడటంలో కోహ్లీని మించిన ఆటగాడు టీమిండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరని గంభీర్ అన్నాడు.
ఈ తరం క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాటర్లుగా ఉన్న బాబర్ అజమ్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌ల కంటే కూడా కోహ్లీనే గొప్ప బ్యాటర్ అని గంభీర్ పేర్కొన్నాడు. కఠిన పరిస్థితుల్లో నిదానంగా, వికెట్లు పడితే.. కీలక భాగస్వామ్యాలు నిర్మిస్తూ.. తన పార్ట్నర్ చెలరేగుతుంటూ యాంకర్ రోల్ పోషిస్తూ.. చివరి ఓవర్స్‌లో దూకుడుగా ఆడటం కోహ్లీకి మాత్రమే సాధ్యమని.. బాబర్, కేన్, స్మిత్ కూడా కోహ్లీలా ఆడలేరని అన్నాడు. కాగా.. సందు దొరికితే విమర్శలతో విరుచుకుపడే గంభీర్ నుంచి వ్యాఖ్యలు రావడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం.. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా.. జట్టు కోసం ఆడాలని కోహ్లీని హెచ్చరించిన గంభీర్.. ఇప్పుడు కోహ్లీని కొనియాడడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కోహ్లీ గొప్పతనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Gautam gambhir describe how virat kohli differ from babar azam, kane williamson, steve smith. 😳#KingKohli #BabarAzam𓃟 #KaneWilliamson #stevesmith #T20worldcup22 pic.twitter.com/oSKE3ZDPEu
— 『ᵇᵉⁿᶻᵉⁿᵉ』.࿐Riju࿐. (@RijuNandi2003) November 2, 2022