టోర్నీ ఆరంభంలో ఇండియా- పాక్ పోరు ఎంతటి మజా అందించిందో.. భారత్ -బంగ్లా మ్యాచ్ అలాంటి మజానే మరోసారి రుచి చూపించింది. చెలరేగి ఆడిన భారత బ్యాటర్లు, బంగ్లాదేశ్ ముందు 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా దాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా బ్యాటర్లు.. భారత బౌలర్లపై ఎదుదాడికి దిగారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. ఈ సమయంలో బంగ్లాదేశ్, భారత్ ను భయపెట్టిందనే చెప్పాలి. ఆపై వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ సారధి ఈ విషయాన్ని అంగీకరించాడు. ‘ఒకానొక సమయంలో మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చినా, దాన్ని కొనసాగించలేక పోతున్నందుకు భాదగా ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు’.
అడిలైడ్ మ్యాచుకు బంగ్లాదేశ్ సారధి షకిబుల్ హసన్ భారత్ ను ఓడించేంత పని చేస్తామంటూ హెచ్చరికలు పంపాడు. అందుకు తగ్గ ప్రదర్శన చేసి చూపించారు.. బంగ్లా ఆటగాళ్లు. బంగ్లాదేశ్ ముందు 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించేసరికి విజయం భారత్ దే అనుకున్నారు అందరూ. అయితే బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ మాత్రం వేరే మైండ్ సెట్ తో బరిలోకి దిగాడు. పవర్ ప్లేలో మెరుపులు మెరిపించాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మ్యాచును మలుపుతిప్పాడు. అయితే 7 ఓవర్లు ముగిసేసరికి మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించింది. ఒకవేళ మ్యాచ్ ఇంతటితో ముగిసుంటే బంగ్లాదే విజయం. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. అప్పటికి 17 పరుగుల ముందంజలో ఉంది.. బంగ్లాదేశ్.
Litton Das’ run out turned the chase around, he was batting superbly #T20WorldCup #INDvBAN
👉 https://t.co/mRp7bYKCJr pic.twitter.com/kep9HwuPud
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2022
అనంతరం వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆట తిరిగి ప్రారంభమయ్యింది. బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులకు కుదించారు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ విసిరిన డైరెక్ట్ హిట్ లిట్టన్ దాస్ ను పెవిలియన్ బాట పట్టించింది. ఇక్కడే మ్యాచ్ బంగ్లా చేతుల్లోంచి భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఆపై ఆఖరి బంతి వరకు పోరాడిన బంగ్లా బ్యాటర్లు 145 పరుగులకే పరిమితమయ్యారు. ఈ ఓటమిపై మ్యాచ్ ప్రెసెంటేషన్ లో మాట్లాడిన షకిబుల్ హసన్, ఇండియాను ఓడించలేకపోతున్నందుకు భాధగా ఉందని తెలిపాడు.
🚨 Update from Adelaide
Revised target for Bangladesh 🔽
Runs to win: 151
Overs: 16
Bangladesh need 85 runs from 54 balls.
Follow the match ▶️ https://t.co/Tspn2vo9dQ#TeamIndia | #T20WorldCup | #INDvBAN pic.twitter.com/jJzfmEfzZS
— BCCI (@BCCI) November 2, 2022
” మేము భారత్‌తో ఎప్పుడు మ్యాచ్ ఆడినా ఇదే జరుగుతోంది. మ్యాచులో పైచేయి సాధిస్తున్నాం కానీ, దాన్ని ఫినిష్ చేయలేకపోతున్నాం. ఇది తీవ్ర నిరాశను కలిగిస్తోంది. భారీ టార్గెట్ అయినా లిట్టన్ దాస్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ గెలవగలమనే నమ్మకాన్ని ఇచ్చింది. అయితే వర్షం మమ్మల్ని దెబ్బకొట్టింది. ఇక భారత్ బ్యాటింగ్ విషయానికొస్తే టాప్ ఫోర్‌లో ఉన్న నలుగురు ప్రమాదకరమైన ఆటగాళ్లు..” అంటూ షకీబ్ ఎమోషనల్ అయ్యాడు”. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్తు కు దగ్గరవ్వగా, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
India go on top of the Group 2 table with three wins 🔝#T20WorldCup Standings 👉 https://t.co/cjmWWRz68E pic.twitter.com/D7pFFGhHud
— ICC (@ICC) November 2, 2022