మునుపెన్నడూ లేనంత హోరా హోరీగా సాగుతోంది.. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్. ఎలాంటి అంచనాలు లేని పసికూన జట్లు సంచలన విజయాలు నమోదు చేయడమే కాకుండా పెద్ద జట్లకు ప్రపంచ కప్ ఆశలను దూరం చేస్తున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ జట్టు, దక్షిణాఫ్రికాపై 13 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రొటీస్ జట్టును టోర్నీకి దూరం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 158 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. సౌతాఫ్రికా 145 పరుగులకే పరిమితమయ్యింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీస్ దూరం కాగా.. భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది.
సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచులో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కున్న నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కొలిన్ ఆకర్‌మన్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, స్టీఫెన్ మైబర్గ్ 37, టామ్ కూపర్ 35, మాక్స్ ఓడౌడ్ 29 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా, నోర్ట్జే 4 ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.
అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రొటీస్ బ్యాటర్లలో రిలీ రోసో చేసిన 25 పరుగులే అత్యధిక స్కోరు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన నెదర్లాండ్స్ బౌలర్లు దక్షిణాఫ్రికా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లారు. బ్రండన్ గ్లోవర్ 3 వికెట్లు పడగొట్టగా, డీ లీడే, ఫ్రెడ్ క్లాసెన్ చెరో 2 వికెట్లు, పాల్ వాన్ మీకెరెన్ ఒక వికెట్ తీశారు. దీంతో ఆదివారం పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్ రెండో గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే జట్టు ఎదన్నది నిర్ణయించనుంది. ఈ రెండు జట్లలో విజయం సాధించిన జట్టు నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది.
WHAT A WIN! 🤩
Netherlands defeat South Africa in their final Group 2 match of #T20WorldCup#SAvNED |📝: https://t.co/4UJVijHlTA pic.twitter.com/zhmHSOpqVe
— ICC (@ICC) November 6, 2022
Beware of Teams..#T20WorldCup #SAvNED pic.twitter.com/xsJEPf1YjB
— RVCJ Media (@RVCJ_FB) November 6, 2022