టీ20 వరల్డ్ కప్ లో మ్యాచులు జరగడం ఏమో కానీ.. కొన్ని కొన్ని విషయాలు మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి. మ్యాచులకు వర్షం అడ్డంకిగా నిలవడం దగ్గర నుంచి డక్ వర్త్ లూయిస్ విధానం వల్ల ఫలితాలు మారిపోవడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి పలువురు నెటిజన్స్ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇదే మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. బయటవాళ్లు ఎంత గొంతు చించుకున్నా సరే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ మాత్రం ఈ ఇష్యూపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆడిలైడ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మన జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 184/6 స్కోరు చేసింది. ఇక తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. పవర్ ప్లేలో రఫ్ఫాడించింది. ఏకంగా 7 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసింది. ఇలాంటి టైంలో వర్షం పడటం వల్ల మ్యాచ్ ని కొంతసేపు నిలిపేశారు. తగ్గిన వెంటనే మళ్లీ మ్యాచ్ మొదలుపెట్టారు. మ్యాచ్ ని 16 ఓవర్లకు కుదించి 151 పరుగులు టార్గెట్ గా ఫిక్స్ చేశారు. అయితే వర్షం పడకముందు బాగానే ఆడిన బంగ్లా ఆటగాళ్లు.. తిరిగి స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా తడబడ్డారు. వరస వికెట్లు కోల్పోయి 5 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయారు.
చివరి బంతి వచ్చిన ఈ మ్యాచ్.. ప్రేక్షకుల థ్రిల్లర్ సినిమా కంటే ఎక్కువ థ్రిల్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లా కావాలనే ఓడిపోయందని కూడా పలువురు నెటిజన్స్ విమర్శలు చేశారు. ఇకపోతే ఇదే విషయమై.. బంగ్లా కెప్టెన్ షకీబ్ ని కూడా ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. వర్షం ఆగిన వెంటనే ఆలస్యం చేయకుండా మ్యాచ్ ప్రారంభించారు కదా.. ఇది మీ ఓటమికి ఏమైనా రీజన్ అయిందా అని షకీబ్ ని అడిగారు. ‘పెయిర్- అన్ ఫెయిర్ అనే విషయం గురించి మా డ్రస్సింగ్ రూంలో ఏం మాట్లాడలేదు. మేం మ్యాచ్ ఆడాలనుకున్నాం. గెలవాలనుకున్నాం. అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. కానీ చివరి వరకు మ్యాచ్ ఓడిపోయాం’ అని షకీబ్ తన మనసులో మాట బయటపెట్టాడు.