టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్ థ్రిల్లర్ సినిమాలా మలుపులు తిరుగుతోంది. టీమిండియా భారీ స్కోర్ చేసిందని ఆనందించేలోపే.. బంగ్లాదేశ్ పరుగుల వరద పారించింది. బంగ్లాదేశ్ జోరు కొనసాగుతోందన్న తరుణంలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. కాసేపు వాన పడిన తర్వాత అంపైర్లు మ్యాచ్‌ని 16 ఓవర్లకు కుదించారు. ఇప్పటికే 7 ఓవర్లలో 66 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. ఇంకా 54 బంతుల్లో 85 పరుగులు చేయాల్సి ఉంది. అంపైర్లు వర్షం తగ్గిన తర్వాత వాతావరణాన్ని గమనించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరిగి మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. వచ్చీ రాగానే లింటన్ దాస్ పరుగు తీస్తూ జారిపడ్డాడు. తర్వాత 8వ ఓవర్లో అశ్విని వేసిన రెండో బంతికి పరుగు కోసం ప్రయత్నంచగా కేఎల్ రాహుల్ విసిరిన డైరెక్ట్ త్రోకి అవుటయ్యాడు. లింటన్ దాస్ 27 బంతుల్లో 60 పరుగులు చేశాడు.
షకీబ్ అల్ హసన్‌కి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని షకీబ్ ముందే ఊహించినట్లు ఉన్నాడు. అందుకే మ్యాచ్ రీస్టార్ చేసేందుకు అంపైర్లు సిద్ధమవుతుండగా షకీబ్ వారితో వాదనకు దిగాడు. ఎంతకూ అంపైర్లతో డిస్కస్ చేస్తూనే ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా చెప్పేందుకు ప్రయత్నించగా.. అతడిని కూడా వారించి అంపైర్లతో వాదిస్తూనే ఉన్నాడు. అంపైర్లు కూడా చివరకి మా నిర్ణయం ఇది అని గట్టిగా చెప్పినట్లు ఉన్నారు. ఇంక షకీబ్ చేసేది లేక సైలెంట్ గా డగౌట్‌కి తిరిగి వెళ్లిపోయాడు. అయితే షకీబ్ భయపడినట్లుగానే మ్యాచ్ మొత్తం మళ్లీ భారత్ చేతుల్లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు వచ్చీ రాగానే రెండు వికెట్లు కోల్పోయింది. లింటన్ దాస్ తర్వాత షాంతో కూడా 25 బంతుల్లో 21 పరుగులు చేసి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
Bangladesh’s charge halted by rain in Adelaide ⛈
They are ahead by 17 runs on DLS at this stage!#T20WorldCup | #INDvBAN | 📝: https://t.co/vDRjKeeGvf pic.twitter.com/0okTJ01POZ
— ICC (@ICC) November 2, 2022
అయితే ఈ మ్యాచ్‌లో షకీబ్ అంపైర్లతో వాదనకు దిగడం ఇది మొదటిసారి కాదు. ఇదే మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ సమయంలోనూ అంపైర్ల నిర్ణయంపై షకీబ్ అల్ హసన్ అసహనం వ్యక్తం చేయడం చూశాం. హసన్ మహ్మద్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ని కోహ్లీ అడగగానే నో బాల్ ఇచ్చారంటూ షకీబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి ఆ ఓవర్లో హసన్ రెండో షార్ట్ పిచ్ బాల్ వేయగా అది కోహ్లీ హెల్మెట్ ఎత్తుకు వెళ్లింది.. దానిని అంపైర్ నోబాల్ గా ప్రకటించాడు. కానీ షకీబ్ మాత్రం అంపైర్ల మీదకు దూసుకెళ్తుండగా మధ్యలో కోహ్లీ కలగజేసుకుని సర్దిచెప్పాడు. కోహ్లీ కూడా అది నోబాల్ అంటూ చెప్పడంతో షకీబ్ ఇంక చేసేది లేక వెనుదిరిగాడు. మ్యాచ్ మాత్రం ప్రస్తుతం 50-50 ఛాన్సెస్‌లో కొనసాగుతోంది.
Play to resume soon in Adelaide 🙌
The revised target for Bangladesh is 151 from 16 overs 👀#T20WorldCup | #INDvBAN | 📝: https://t.co/vDRjKeeGvf pic.twitter.com/J0qqus3Tmg
— ICC (@ICC) November 2, 2022
Bangladesh lose two quick wickets after the rain break 😯#T20WorldCup | #INDvBAN | 📝: https://t.co/vDRjKeeGvf pic.twitter.com/eOrgwV0y8r
— ICC (@ICC) November 2, 2022