టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. బాబర్ అజమ్‌ను సెల్ఫిష్ ప్లేయర్ అంటూ కామెంట్ చేశాడు. ఫామ్‌లో లేకపోయినా బాబర్ తన స్వార్థం కోసం ఓపెనర్‌గానే ఆడుతున్నాడని.. ఓపెనింగ్ స్థానం ఫకర్ జమాన్‌కు ఇస్తే బాగుంటుందని.. అలా కాకుండా తన వ్యక్తిగత రికార్డుల కోసం తానే ఓపెనర్‌గా వస్తూ.. బాబర్ స్వార్థపరుడిగా కనిపిస్తున్నాడంటూ..జట్టు కోసం ఆడాలని, వ్యక్తిగత రికార్డుల కోసం కాదని గంభీర్ పేర్కొన్నాడు. ఈ కామెంట్లపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఘాటుగా స్పందించాడు. విమర్శ చేసే ముందు ఎలాంటి పదాలు వాడుతున్నామో కాస్త చూసుకోవాలని గంభీర్‌ను ఉద్దేశించి సీరియస్ అయ్యాడు.
అఫ్రిదీ మాట్లాడుతూ.. ఒక ఆటగాడి గురించి విమర్శ చేస్తే.. అది అతన్ని మంచి కోరి, అతని ఆటను బెటర్ చేసేదిలా ఉండాలి కానీ కించపరిచేలా ఉండకూడదని అన్నాడు. అయినా.. అతని(గంభీర్) వ్యాఖ్యలపై స్పందించి మాట్లాడనిమని బాబర్ అజమ్‌ను కూడా చెప్తామని.. ఎందుకంటే అతను కూడా ఇండియాకు తిరిగి వెళ్లాల్సిన వాడే కదా అంటూ అఫ్రిదీ పేర్కొన్నాడు. అయినా బాబర్ అజమ్ ఎన్నో మ్యాచ్ విన్నింగ్స్ ప్రదర్శనలు చేశాడని.. అతని ఎంతో నిలకడ చూపించాడని, అతనికి ఉన్న స్టాట్స్ చాలామంది పాక్ ప్లేయర్ల కంటే మెరుగ్గా ఉన్నాయని తెలిపాడు. అతనిపై ఉన్న అంచనాలే అతన్ని ఇలాంటి చెత్త మాటలు పడేలా చేస్తుందోని అఫ్రిదీ అన్నాడు.
అయితే అఫ్రిదీ-గంభీర్‌కు ఇప్పుడే కాదు.. వారు ఆడే సమయంలోనూ పడేది కాదు. ఇద్దరూ అప్పుడు ఇప్పుడు బద్ధశత్రువులే అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. నేడు టీమిండియా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌పై కూడా అఫ్రిదీ స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్ అని అన్నాడు. భారత జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారని.. బంగ్లా టీమ్‌లో ఆ డెప్త్ కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు. అయితే టీమిండియా పేపర్ బలంగా కనిపిస్తున్నా.. బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయలేమని.. టీ20 క్రికెట్‌లో ఏదైన జరగొచ్చని తెలిపాడు. ఒక వేళ బంగ్లాదేశ్ టీమిండియాను ఓడిస్తే.. అది పాకిస్థాన్‌కు మంచి చేస్తుందని అన్నాడు.
Afridi vs Gambhir again?https://t.co/8Q0ykHMYBi
— HT Sports (@HTSportsNews) November 2, 2022