టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన కనపరుస్తోంది. ఆడిన 4 మ్యాచుల్లో మూడింటిలో గెలిచి ఒకదానిలో ఓటమి పాలైంది. ఫలితంగా 6 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. దాదాపు ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ అయినా.. జింబాబ్వేతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే ఏ లెక్కలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయినా సెమీస్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో దాయాది జట్టు పాకిస్తాన్ ప్రయాణం చెప్పుకోతగ్గ రీతిలో లేదు. దాదాపు ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించింది. అద్భుతాలు జరిగితే తప్ప సెమీస్ చేరదు. దీంతో పాక్ మాజీ ఆటగాళ్లు టీమిండియాపై ఏడుపు లెక్కిస్తున్నారు. తాజాగా, పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ అండతోనే టీమిండియా విజయాలు సాధింస్తుందంటూ నోరు పారేసుకున్నాడు.
ఆఖరిబంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన భారత్-బంగ్లా పోరులో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడం, విరాట్ కోహ్లీపై నిందలు మోపుతూ ఫేక్ ఫీల్డింగ్.. అని బంగ్లా, పాక్ అభిమానులు, ఆటగాళ్లు సాకులు చెప్పడం కూడా విన్నాం. ఈ విజయంతో భారత్ సెమీస్ దగ్గరవ్వగా, పాక్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. దీంతో పాకిస్థాన్ మాజీ సారధి షాహిద్ అఫ్రిది.. టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ.. ఐసీసీపై తీవ్ర ఆరోపణలు చేశాడు. భారతన్ ను ఎలాగైనా సెమీస్ లో ఆడించాలని ఐసీసీ అనుకుందని, అందుకే పాక్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో టీమిండియాకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా వ్యవహరించిందని ఆరోపించాడు.
Former Pakistan captain Shahid Afridi has made serious allegations over the International Cricket Council (ICC) following India’s 5-run win against Bangladesh in Adelaide. #INDvBAN #T20WorldCup https://t.co/uY3zmf5MmQ pic.twitter.com/cSYmzQvDdP
— News18.com (@news18dotcom) November 4, 2022
“భారత్ – బంగ్లా మ్యాచును క్షుణ్ణంగా పరిశీలించండి. మొదటి ఇన్నింగ్స్ సజావుగా సాగినా బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. గంటసేపు వర్షం కురవడం వల్ల ఫీల్డ్ చాలా చిత్తడిగా మారింది. ఆట కొనసాగిస్తే.. ప్లేయర్లకు ప్రమాదమని తెలిసినా ఐసీసీ, భారత్ కు అనుకూలంగా వ్యవహరించింది. ఇక్కడ ఐసీసీ ఆలోచన ఒక్కటే.. ఎలాగైనా భారత్ సెమీస్ చేర్చాలి. ఆది నుంచి వీరి ప్రయత్నం అదే. బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా వర్షం ఆగిపోగానే.. వెంటనే ప్రారంభించడానికి చాలా కారణాలున్నట్లు ఉన్నాయి. అంపైర్ల తొందరపాటు నిర్ణయం.. భారత్ ఆడటం.. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది”.
“ఏదేమైనా లిటన్ దాస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు ఓవర్ల తర్వాత బంగ్లాదే విజయమని మేమంతా భావించాం. అయితే పరిస్థితులు కలిసి రాలేదు. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక బంగ్లాదేశ్ కానీ వికెట్లు కోల్పోకపోయుంటే తప్పకుండా గెలిచేది. అయినా బంగ్లా ఆఖరి బంతి వరకు శాయశక్తులా పోరాడింది. ఇక ఈ మ్యాచులో అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించినవారికి తప్పనిసరిగా ఉత్తమ అంపైరింగ్ అవార్డులు దక్కుతాయి..” అని అప్రిది వ్యాఖ్యానించాడు. ఇక భారత్ తన చివరి మ్యాచ్లో జింబాబ్వేను ఓడిస్తే.. ఎలాంటి సమీకరణాలతో అవసరం లేకుండా నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది.
Shahid Afridi via Samaa 🗣
“You saw the ground how wet it was. But ICC is inclined towards India. They want to ensure India reaches the semi-finals at any cost. The umpires were also the same who officiated India vs Pakistan & will get the best umpire awards” #T20WorldCup pic.twitter.com/5nLFEmKsCm
— CWA – Cricket with Anas (@CricketwithAnas) November 4, 2022