ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టాప్ జట్ల కంటే చిన్న చిన్న జట్లే అద్భుతంగా రాణిస్తున్నాయి. వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది అని చెప్పేందుకు ఆదివారం సౌత్ ఆఫ్రికా- నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తమ ప్రతిభను చూపెడుతూనే ఉంది. ఓడినా, గెలిచినా ప్రత్యర్థికి టఫ్ ఫైడ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వరల్డ్ కప్‌లోనే ఓ అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. సౌత్ ఆఫ్రికాని సెమీస్‌కు దూరం చేశారు. దాదాపుగా సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నట్లే. అందుకు కారణం నెదర్లాండ్స్ జట్టే. కచ్చితంగా గెలవాల్సిన.. గెలుస్తారు అనుకున్న మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా ఓటమిపాలైంది. టీమిండియా సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్‌లో ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఒకటి జరిగింది. అదేంటంటే.. సౌత్ ఆఫ్రికా సెమీస్‌కు చేరకుండా అడ్డుపడిన వారిలో ముఖ్యంగా ఆ దేశానికి ఆడిన వ్యక్తే ఉండటం విశేషం. అవును మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో అప్పటికే టాపార్డర్ కూలిపోయింది. కానీ, డేవిడ్ మిల్లర్ చిన్నగా పార్టనర్‌షిప్ బిల్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ని పట్టుకుని సౌత్ ఆఫ్రికా జట్టుని చావుదెబ్బ కొట్టాడు. అతను మరెవరో కాదు.. రొలోఫ్ వాన్ డెర్ మెర్వ్. అతను గతంలో 2009 నుంచి 2011 వరకు సౌత్ ఆఫ్రికా తరఫునే తన కెరీర్‌ని కొనసాగించాడు. 2015 నుంచి మాత్రం నెదర్లాండ్స్ తరఫున తన కెరీర్‌ని కొనసాగిస్తున్నాడు.
WHAT A WIN! 🤩
Netherlands defeat South Africa in their final Group 2 match of #T20WorldCup#SAvNED |📝: https://t.co/uV2K8BEShf pic.twitter.com/FiN3eRnDim
— T20 World Cup (@T20WorldCup) November 6, 2022
16వ ఓవర్లో గ్లోవర్ వేసిన రెండో బంతిని డేవిడ్ మిల్లర్ షాటాడే ప్రయత్నం చేయగా.. అది టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. అప్పుడు రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి సూపర్ క్యాచ్ తీసుకుని డేవిడ్ మిల్లర్(17) పరుగులకే కట్టడి చేశాడు. ఆ క్యాచ్ మొత్తం మ్యాచ్‌నే మలుపు తిప్పిన ఘటనగా చెప్పొచ్చు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ ని తక్కువ స్కోర్‌కి కట్టడి చేయలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. రోసోవ్(25) ఒక్కడే అత్యధిక పరుగులు చేసింది. బవుమా(20), క్లాసెన్(21) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. వెరసి నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికాపై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Pure magic from Roelof van der Merwe!
Iconic moments like this from every game will be available as officially licensed ICC digital collectibles with @0xFanCraze
Visit https://t.co/EaGDgPxhJN today to see if this could be a Crictos of the Game. pic.twitter.com/vmSWRa8OvG
— T20 World Cup (@T20WorldCup) November 6, 2022