టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లో మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. దీంతో అభిమానులు కోహ్లీ ఆట తీరుపై చాలా సంతోషంతో ఉన్నారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించిన కోహ్లీ.. నేడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆసియా కప్ కంటే ముందు ఫామ్ లేమితో సతమతమైన కోహ్లీ.. ఆ తర్వాత మునపటి ఫామ్ ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతని పేరే ఒక చర్చ అన్నట్లుగా సాగుతోంది.
31 పరుగులకే 4 వికెట్ల కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను విజయతీరాలకు చేర్చిన ఘనత.. నూటికి నూరు శాతం కోహ్లీదే. అందులోనూ చివరి 3 ఓవర్లలో విజయానికి 49 పరుగులు అవసరం కాగా, ఆ సమయంలో కోహ్లీ పోరాడిన తీరు, చూపించిన తెగువ మాటల్లో వర్ణించలేనిది. సగటు క్రికెట్ అభిమానిగా, ఒక భారతీయుడిగా దుఃఖం తన్నుకు రావాల్సిందే. ఈ ప్రదర్శనపై ట్విటర్ వేదికగా పలువురు కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ తరుణంలో ఐపీఎల్ ప్రాంచైజీ కోలకతా నైట్ రైడర్స్ కూడా కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తింది. “ఇది విరాట్ కోహ్లీ ప్రపంచమని.. అందులో మనమంతా బతుకుతున్నామని..” ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
It’s VIRAT KOHLI’S WORLD & WE ARE LIVING IN IT! 👑#INDvPAK #T20WorldCup
— KolkataKnightRiders (@KKRiders) October 23, 2022
ఇదిలా ఉంచితే.. కొన్నాళ్ల క్రితం జట్టులో కోహ్లీ స్థానం గురించ మీడియా, మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జట్టు నుంచి తొలగించకుండా.. ఎందుకు ఆడనిస్తున్నారంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. ప్రస్తుతం వీళ్లందరూ నోరుమెదపకపోగా, ఎటు పోయారో కూడా అంతుపట్టడం లేదు. దీంతో కోహ్లీ అభిమానులు నానా రచ్చ చేస్తున్నారు. ‘డియర్ కోహ్లీ హేటర్స్.. మీరంతా ఎక్కడ పడుకున్నారు.’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, అప్పట్లో ఈ వ్యాఖ్యలపై కోహ్లీ స్పందించిన సంగతి తెలిసిందే. ‘ఒకసారి నేను ఈ దశ నుంచి బయటకు వచ్చాక ఎంత నిలకడగా ఆడతానో చూడండి..’ అని చెప్పాడు. ఆ మాటలను నిజం చేసి చూపిస్తున్నాడు.
Virat Kohli in his own league. pic.twitter.com/gTch0nl0y2
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2022