టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో బట్లర్ సేన 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, కివీస్ ముందు180 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, కేన్ మావ సేన ఆ టార్గెట్ ను చేధించలేకపోయింది. 159 పరుగులకే పరిమితమై 20 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. అయితే.. ఈ మ్యాచ్ ఓటమికి కివీస్ సారధి కేన్ విలియమ్సన్ కారణమని చెప్పకనే చెప్పొచ్చు. చేధించాల్సింది భారీ లక్ష్యమన్న కనీస జ్ఞానం లేకుండా అతడు బ్యాటింగ్ సాగింది. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు.
పొట్టి ఫార్మట్ అంటేనే.. సిక్సులు, ఫోర్ల జోరు. ఈ ఫార్మాట్ లో బౌలర్ల ఆధిపత్యం చాలా తక్కువ. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీ తరలించాలన్నుట్లుగా బ్యాటర్లు ఆడుతుంటారు. అలాంటిది న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో తన జిడ్డు బ్యాటింగ్ తో ప్రేక్షకులకు విసుగుపుట్టించడమే కాకుండా మ్యాచును సైతం దూరం చేశాడు. చేధించాల్సింది కొండంత లక్ష్యం.. గెలిస్తే సెమీస్ కు చేరే అవకాశాలు పక్కా. అయినా విలియమ్సన్ లో ఆ కసి ఎక్కడా కనిపించలేదు. ఏదో వన్డే మ్యాచ్ కదా అన్నట్లుగా 40 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీల సాయంతో 40 పరుగులు చేశాడు. ఫలితంగా మ్యాచ్ కివీస్ చేతుల్లోని నుంచి ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
Do New Zealand have a Kane Williamson problem in T20s? #T20WorldCup pic.twitter.com/TyZRsSP924
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2022
అందునా మంచి కెప్టెన్ గా పేరు పొందిన కేన్ విలియమ్సన్ ఒక క్యాచ్ విషయంలో తొలిసారి చీటింగ్ చేయడం సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యపరిచింది. బట్లర్ కొట్టిన ఒక బంతిని క్యాచ్ జారవిడిచినప్పటికీ, పట్టినట్లుగా నటించడమే అందుకు కారణం. ఆపై అతడు క్షమాపణలు కోరినప్పటికీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. విలియమ్సన్ చీటర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. ఇక ఈ విజయంతో గ్రూప్-1 సెమీస్ పోరు ఆసక్తికరంగా మారింది. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లకు మాత్రమే సెమీస్ చేరే అవకాశం ఉండడంతో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Kane Williamson is the only player who makes his country happy and opponent sad after his dismissal in every match.#ENGvsNZ pic.twitter.com/JptNvHz6CB
— Akshat (@AkshatOM10) November 1, 2022