ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్‌తో సరిపెట్టుకుంది. సూపర్ 12లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత.. నెదర్లాండ్స్‌పై గెలిచి.. సౌతాఫ్రికాతో ఓడి, బంగ్లా, జింబాబ్వేను ఓడించి.. గ్రూప్ బీ టాపర్‌గా సెమీస్ చేరింది. కానీ.. సెమీస్‌లో మాత్రం పసికూన ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్లతో దారుణ పరాజయాన్ని చవి చూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కేవలం విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌తోనే ఇండియా సెమీస్ వరకు వచ్చిందని.. లేకుంటూ.. సూపర్ 12 నుంచి ఇంటికొచ్చేదని విమర్శించారు.
నిజానికి ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శన అంత గొప్పగా ఏం లేదనేది వాస్తవమే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తప్పతే టోర్నీలో టీమిండియా సాధారణ ప్రదర్శనే చేసింది. గ్రూప్ బీలో పటిష్టమైన సౌతాఫ్రికా చేతిలో ఓడిన టీమిండియా.. నెదర్లాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి పసికూన జట్లపై నెగ్గి సెమీస్ చేరింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఇంగ్లండ్ తగులుకుంటే గానీ.. అసలైన టీమిండియా సత్తా ఏంటో బయటపడేదు. ఆ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించినా.. బౌలర్లు చేతులెత్తేయడంతో టీమిండియా దారుణంగా ఓడింది. అయితే.. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లోనూ.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. కోహ్లీకి ‘నిస్సాన్ బెస్ట్ ప్లే ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు వచ్చింది.
తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఎలాంటి వీరోచిత పోరాటం చేసి మ్యాచ్ గెలిపించాడో చూశాం. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో ఓటమి కోరలు చాస్తున్న సమయంలో శివాలెత్తిన కోహ్లీ.. పాకిస్థాన్ టాప్ బౌలర్ హరీస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ 19వ చివరి రెండు బంతులను సిక్సులుగా మలిచి.. మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. ముఖ్యంగా గుడ్‌లెంత్ డెలవరీని బౌలర్ తలపై నుంచి స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్ అయితే.. అదో అద్భుతం. ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా ఆ షాట్ ఆడలేడని క్రికెట ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెప్పింది. పాకిస్థాన్ మాజీలు సైతం కోహ్లీ షాట్‌ను కొనియాడారు. ఆ తర్వాత ఫైన్‌లెగ్ మీదుగా మరో ఫ్లిక్ సిక్స్ కూడా సూపర్ షాట్. అందుకే ఈ రెండు సిక్స్‌లకు నిస్సాన్ బెస్ట్ ప్లే ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ప్రకటించింది ఐసీసీ. అలాగే గ్రేటెస్ట్ సింగిల్ టీ20 షాట్ ఆఫ్ ఆల్‌టైమ్ అని కూడా కోహ్లీ కొట్టిన స్ట్రేయిట్ సిక్స్‌ను కొనియాడింది ఐసీసీ.
Virat Kohli won the “Nissan best Play of the tournament” award for the 2 sixes vs Rauf in the T20 World Cup.
— Johns. (@CricCrazyJohns) November 17, 2022
India might not have won the #T20WorldCup, but Virat Kohli once again left his mark. 🔥 pic.twitter.com/Y7nONW6JBM
— Wisden India (@WisdenIndia) November 15, 2022
This Shot of Virat Kohli has a Seperate Fanbasepic.twitter.com/LoB2MkNwrN
— leishaa ✨ (@katyxkohli17) November 16, 2022