ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో చాలా జట్ల విషయాల్లో నిపుణులు, అభిమానుల అంచనాలు తారుమారు అవ్వడం చూశాం. ఈ వరల్డ్ కప్‌లో చాలా జట్లు అంచనాలకు మించి రాణిస్తుంటే.. కొన్నిజట్లు మాత్రం అంచనాలను గల్లంతు చేస్తున్నాయి. అలాంటి జట్ల జాబితా తీస్తే.. ముందువరుసలో ఆస్ట్రేలియా ఉంటుంది. అఫ్గాన్‌పై గెలిచిన తర్వాత వారి సెమీస్ ఆశలు ఇంగ్లాండ్ చేతుల్లో ఉన్నాయి. అయితే ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌ను లాక్కొచ్చి ఎలాగో శ్రీలకంపై ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. నిజానికి న్యూజిలాండ్- ఇంగ్లాండ్- ఆస్ట్రేలియాలకు సమానంగానే పాయింట్లు ఉన్నా కూడా.. నెట్ రన్‌రేట్ లో చాలా తేడా ఉంది. ఇంగ్లాడ్ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయిపోయింది.
ఆస్ట్రేలియా ఓటములకు పునాది న్యూజిలాండ్ వేసింది. తొలి మ్యాచ్‌లో 89 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ తర్వాత శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్నే నమోదు చేసింది. కానీ, మూడో మ్యాచ్ మాత్రం వర్షార్పణం అయ్యింది. అందువల్ల గెలిచుంటే ఒక పాయింట్ ఎక్కువే ఉండేది. కానీ, వర్షం కూడా వీరి ఓటమిలో కీలక పాత్ర పోషించింది. ఐర్లాండ్ లాంటి జట్టుపై 42 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసినా కూడా.. ఆఫ్గనిస్తాన్ జట్టు మాత్రం ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్‌పై గట్టి దెబ్బే కొట్టింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను కొట్టిన ప్రతి పరుగు ఆస్ట్రేలియాని సెమీస్‌కు దూరం చేయడంలో కీలకంగా మారాయి.
అయితే ఈ పరాజయం పట్ల జట్టు, ఫ్యాన్స్ ఎలా స్పందించినా కూడా మ్యాక్స్ వెల్ పేరు మాత్రం వైరల్‌గా మారింది. తన సోషల్ మీడియా వేదికగా అతను చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. టోర్నమెంట్ నుంచి వైదొలిగామన్న బాధతోనో, అక్కసుతోనే మ్యాక్స్ వెల్ తన ట్విట్టర్ ఖాతాలో బగ్గర్(పెద్ద బూతు) అంటూ ట్వీట్ చేశాడు. అయతే అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అలా ఎందుకు స్పందించాల్సి వచ్చింది అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ, నెట్టింట మాత్రం ఎవరికి తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ మాత్రం మ్యాక్సీకి అండగా నిలుస్తున్నారు. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అంటూ ధైర్యం చెబుతున్నారు. ఈ టోర్నమెంట్‌లో మ్యాక్స్ వెల్ అఫ్గాన్‌పై(54*), ఐర్లాండ్‌పై(13), ఇంగ్లాండ్‌తో మ్యాచ్ రద్దు, శ్రీలంకపై(23), న్యూజిలాండ్‌పై(28) పరుగులు చేశాడు.
Bugger…
— Glenn Maxwell (@Gmaxi_32) November 5, 2022