ఎక్కడ లేని వింతలన్నీ కూడా ఈసారి టీ20 వరల్డ్ కప్ లోనే జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్, ఒక్క బంతికి 14 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు మరో ఇన్సిడెంట్ వైరల్ గా మారింది. మ్యాచ్ లో ప్రతి బంతిని పరిశీలించాల్సిన అంపైర్లు.. కళ్లు మూసుకున్నారా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆస్ట్రేలియా-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ చూసిన వారందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అన్ని సదుపాయాలు ఉన్నాసరే ఇలా చేస్తున్నారేంటి అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆడిలైడ్ లో ఆస్ట్రేలియా-అప్ఘానిస్థాన్ జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ 54, మిచెల్ మార్ష్ 45 పరుగులతో ఆకట్టుకునే బ్యాటింగ్ చేశారు. అయితే ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో విచిత్రమై సంఘటన జరిగింది. ఓపెనర్ గా వచ్చిన గ్రీన్ 3 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వార్నర్, మార్ష్ కలిసి ధాటిగా ఆడుతున్నారు. ఇక నాలుగో ఓవర్ ని నవీన్ ఉల్ హక్ వేశాడు. ఈ ఓవర్ లోని నాలుగో బంతిని మార్ష్ ఎదుర్కొన్నాడు. అతడు కొట్టిన బంతిని, ఫీల్డర్ ఓవర్ త్రో చేయడంతో బ్యాటర్లు మూడు పరుగులు తీశారు. ఇది చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది.
ఈ క్రమంలో అంపైర్లు, స్కోరు బోర్డు మేనేజర్ పొరబడ్డారు. నవీన్ ఉల్ హక్ వేసిన ఓవర్ నాలుగో బంతికి 2, ఐదో బంతికి 3 పరుగులు వచ్చినట్లు రాసుకున్నారు. ఆ తర్వాత బంతి డాట్ బాల్ పడింది. దీంతో ఓవర్ పూర్తయి పోయిందని అంపైర్లు ప్రకటించారు. ఇన్నింగ్స్ మొత్తం పూర్తయ్యాక స్కోరు కార్డులో అదనంగా వచ్చిన ఆ రెండు పరుగులని కలపలేదు. ఈ విషయాన్ని పట్టేసిన నెటిజన్లు.. అంపైర్ల పొరపాటు వల్ల ఆస్ట్రేలియా జట్టు ఓ బంతితో పాటు రెండు పరుగులని కోల్పోయిందని ఎత్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. శ్రీలంక చేతిలో ఇంగ్లాండ్ ఓడితేనే ఆసీస్ సెమీస్ లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే.. ఆ జట్టు మెరుగైన రన్ రేట్ కారణంగా సెమీస్ లోకి వెళ్లిపోతుంది. ఆస్ట్రేలియా ఇంటికెళ్తుంది.
Naveen Ul Haq bowled a 5 Balls over against Australia. Remember that it’s all important match for Australia as they have to win the match by a huge margin to confirm a semi-final spot in the ongoing #T20WorldCup2022.#AUSvsAFG #T20WorldCup pic.twitter.com/cGVWNwJZfi
— Enable Pakistan (@PakistanEnable) November 4, 2022