ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న మెగా వేలంలో ఇప్పటికే టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను రూ.8.75 కోట్లకు దక్కించుకన్న SRH.. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్ల భారీ ధర ఇచ్చి కొనుగోలు చేసింది. దీంతో జట్టుకు ఒక బలమైన హిట్టర్ దొరికినట్లు అయింది.
ఇప్పటికే సమద్ లాంటి యువ క్రికెటర్‌తో పాటు సీనియర్ అయిన పూరన్‌తో సన్‌రైజర్స్ మిడిలార్డర్ బలపడింది. గతంలో పూరన్ పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. కాగా పూరన్ కోసం కోల్‌కత్తా నైట్ రైడర్స్ కూడా పోటీ పడింది. మరి పూరన్‌ను సన్‌రైజర్స్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.