అంర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. సుదీర్ఘ కెరీర్‌కు ముగింపుపలుకుతూ.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. సౌత్ ఆఫ్రికా క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్‌లో రిటైర్మెంట్‌పై ప్రకటన చేశాడు. ‘ఈ రోజు నేను అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను! చిన్నదైనా పెద్దదైనా నా ప్రయాణంలో భాగస్వామ్యమైన వారందరికీ ధన్యవాదాలు…ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం!’ అంటూ పేర్కొన్నాడు.
అలాగే తర్వాత కోచ్‌గా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నట్లు కూడా వెల్లడించాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున 42 వన్డేలు ఆడిన మోరిస్ 48 వికెట్లు, 23 టీ20 మ్యాచ్‌ల్లో 34, 4 టెస్టుల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే, రాజస్థాన్, ఢిల్లీ తరపున ఆడాడు. మరి క్రిస్ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.