న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు యువ ఆటగాడు శుభ్ మన్ గిల్. మూడు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీతో పాటుగా ఓ శతకాన్ని బాది 360 పరుగులు చేశాడు. దాంతో ఓ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా పాక్ కెప్టెన్ బాబర్ రికార్డును సమం చేశాడు గిల్. తాజాగా ఓ క్రీడా ఛానల్ తో మాట్లాడిన గిల్ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సచిన్, విరాట్ కోహ్లీ వీరిద్దరిలో నువ్వు ఎవరిని ఎంచుకుంటావు అన్న ప్రశ్నకు గిల్ అద్బుతమైన, ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.
శుభ్ మన్ గిల్.. టీమిండియాలో ఇప్పుడో యువ సంచలనం. 24 ఏళ్లకే డబుల్ సెంచరీ బాదీ రికార్డు నెలకొల్పాడు ఈ యంగ్ ప్లేయర్. న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది అంటే.. దానికి ప్రధాన కారణం శుభ్ మన్ గిల్ అనే చెప్పాలి. అంతలా ఈ సిరీస్ లో చెలరేగిపోయాడు గిల్. వరల్డ్ క్లాస్ బౌలర్లుగా పేరుగాంచిన కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఓ డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక ఓ క్రీడా ఛానల్ తో మాట్లాడుతుండగా గిల్ కు ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, రన్ మెషిన్ కింగ్ కోహ్లీలలో ఎవరిని ఎంచుకుంటావు అన్న ప్రశ్నకు గిల్ సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చాడు. నేను క్రికెట్ ఆడే సమయానికే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అందుకే నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం.. అతడే నాకు బెస్ట్ అని శుభ్ మన్ గిల్ తెలివిగా సమాధానం ఇచ్చాడు.
ఇక సచిన్ అంటే మా నాన్నకు చాలా ఇష్టం అని శుభ్ మన్ గిల్ అన్నాడు. క్రికెట్ లో విరాట్ కోహ్లీ హవా నడుస్తున్నకాలంలో నేనూ క్రికెట్ ఆడుతున్నాను. ఆ సమయంలో విరాట్ నుంచి ఎంతో నేర్చుకున్నానని శుభ్ మన్ గిల్ చెప్పుకొచ్చాడు. అయితే గిల్-సారా లు గతంలో డేటింగ్ చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి కూడా. ఇక న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి మ్యాచ్ లో కూడా సచిన్ అల్లుడు అంటూ ఫ్యాన్స్ స్టేడియంలో గోల చేసిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గిల్.. సచిన్ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్ అని చెప్పడం క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరి గిల్ నాకు సచిన్ కంటే విరాట్ గొప్ప అని చెప్పిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.