SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rohit Sharma Owned Bad Records By Golden Duck Against West Indies

చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న రోహిత్‌ శర్మ! టెయిలెండర్ల కంటే దారుణం

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న రోహిత్‌ శర్మ! టెయిలెండర్ల కంటే దారుణం

వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘోరంగా ఓడింది. దీంతో విండీస్‌ టూర్‌లో వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. తొలుత బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా తర్వాత బౌలింగ్‌లోనూ తేలిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్‌ డక్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఒబెడ్ మెక్కాయ్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే రోహిత్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Advertisement

ఊరించే షార్ట్ పిచ్ బాల్‌తో హిట్‌మ్యాన్‌ను మెక్కాయ్‌ బోల్తా కొట్టించాడు. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌‌కు టెంప్ట్ అయిన రోహిత్ వికెట్‌ పారేసుకున్నాడు. భారీ షాట్‌కు ప్రయత్నించగా బ్యాక్ వర్డ్ పాయింట్ ఫీల్డర్ అకీల హోస్సెన్ చేతిలో పడింది. ఎక్స్‌ట్రా బౌన్స్ హిట్ మ్యాన్ కొంపముంచింది. దాంతో గోల్డెన్ డక్‌గా భారత కెప్టెన్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ గోల్డెన్‌ డక్‌తో రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు.

rohith sharma

అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు గోల్డెన్ డకౌట్‌ అయిన రెండో ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ నాలుగు సార్లు గోల్డెన్ డకౌటై అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆరోన్ ఫించ్, జాసన్ రాయ్‌లు సైతం మూడు సార్లు డకౌటై రోహిత్‌తో సమంగా నిలిచారు. ఇక ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఔటైన మూడో భారత బ్యాటర్‌గా కూడా రోహిత్ అప్రతిష్టను మూట కట్టుకొన్నాడు. 2016లో కేఎల్ రాహుల్.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఔటయ్యాడు. ఆ తర్వాత 2021లో శ్రీలకంతో పృథ్వీ షా ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే వెనుదిరిగాడు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్ చేరాడు.

అలాగే టీ20ల్లో భారత్‌ తరపున అత్యధిక సార్లు డకౌట్‌ అయిన చెత్త రికార్డులో కూడా రోహిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్‌ ఇప్పటి వరకు ఏకంగా 8 సార్లు డకౌట్‌ అయ్యాడు. అతని తర్వాత కేఎల్‌ రాహుల్‌ 4 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆశిష్‌ నెహ్రా 3, వాషింగ్టన్‌ సుందర్‌ 3, యూసుఫ్‌ పఠాన్‌ 3, రిషభ్‌పంత్‌ 3, సురేష్‌ రైనా 3, విరాట్‌ కోహ్లీ 3, దినేష్‌ కార్తీక్‌ 3 సార్లు టీ20ల్లో డకౌట్‌ అయ్యారు. ఈ చెత్త రికార్డులో వీళ్లకు అందనంత ఎత్తులో రోహిత్‌ శర్మ ఉన్నాడు. బ్యాటింగ్‌ సరిగా రాని టెయిలెండర్ల కంటే కూడా దారుణమైన రికార్డును రోహిత్‌ కలిగి ఉన్నాడు.

rohith sharma

సోషల్‌ మీడియాలో సెటైర్ల వర్షం..
రోహిత్‌ శర్మ గోల్డెన్ డక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్టార్మ్ పేసర్‌తో రోహిత్ శర్మకు విడదీయని బంధం ఉందని సోషల్‌ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవ్వడమే రోహిత్‌ డకౌట్‌కు కారణమని, ఈ మూడు గంటలు రోహిత్ వడాపావ్‌లు లాగించేశాడని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. అసలే మ్యాచ్ ఆలస్యం అయిందంటే.. అందులో రోహిత్ ఔటవ్వడం భారత క్రికెట్‌ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఫోర్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. బ్యాటర్లంతా విఫలయ్యారు. ఒబెడ్ మెక్‌కాయ్ (6/17) సిక్సర్‌తో భారత్ పతనాన్ని శాసించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ డకౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

#TeamIndia put up a solid fight but it was the West Indies who won the second #WIvIND T20I.

We will look to bounce back in the third T20I. 👍 👍

Scorecard 👉 https://t.co/C7ggEOTWOe pic.twitter.com/OnWLKEBiov

— BCCI (@BCCI) August 1, 2022

2ND T20I. WICKET! 0.1: Rohit Sharma 0(1) ct Akeal Hosein b Obed McCoy, India 0/1 https://t.co/OuXkk4FoU5 #WIvIND

— BCCI (@BCCI) August 1, 2022

ఇది కూడా చదవండి: చెత్త షాట్.. పంత్ అవుట్ పై రోహిత్ రియాక్షన్!

Tags :

  • Latest Cricket News
  • Rohit Sharma
  • Team India
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

  • చిన్న పరిశ్రమలకు భారీ ఊతం.. రూ.10,000 కోట్ల ఫండ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం!

  • కాచిగూడలో ఒక్కసారిగా భారీ మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం! అసలేం జరిగిందంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • లండన్‌-చికాగో విమానంలో ఎమర్జెన్సీ.. 37 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా దిగజారిన ఫ్లైట్!

  • నైజీరియాలో కుప్పకూలిన సైనిక విమానం – 32 మంది మృతి

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam