ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. సూపర్ స్టేజ్‌లో పాకిస్థాన్‌పై వచ్చిన తొలి గెలుపు మినహా.. సౌతాఫ్రికాపై ఓటమి, చిన్న జట్లపై విజయాలతో సెమీస్ చేరింది. ఇక సెమీస్‌లో బలమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ ముందు మన బౌలింగ్ ఎటాక్ తేలిపోయింది. ఒక్క వికెట్ కూడా తీయకుండా 170 పరుగులు సమర్పించుకుని 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడారు. ఈ ఓటమితో ఇండియన్ టీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలా అయితే వరల్డ్ కప్స్ సాధించడం కష్టమే అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అయింది. ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై కూడా విమర్శలు వచ్చాయి. దాదాపు ఏడాది నుంచి వరల్డ్ కప్ ప్రణాళికలంటూ పలు రకాల ప్రయోగాలు చూస్తే.. ఆటగాళ్లను మార్చిమార్చి ప్రయోగించినా.. ఇలాంటి ఫలితం రావడంపై ద్రవిడ్‌ను క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.
విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి రోహిత్ శర్మ-ద్రవిడ్ ద్వయం.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను సాధించడమే లక్ష్యంగా ప్రణాళికల ప్రకారం ముందు కెళ్లారు. జట్టులో చాలా ప్రయోగాలే చేశారు. ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ లాంటి ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ ప్రణాళికలో ఉన్నారని వారికి భారీగా అవకాశాలు ఇచ్చారు. కానీ.. షమీ, అశ్విన్ లాంటి వారిని పక్కన పెట్టారు. కానీ.. తీరా వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆడింది మాత్రం వాళ్లిద్దరే. అలాగే దినేష్ కార్తీక్‌ను స్పెషల్‌గా వరల్డ్ కప్ కోసం ఆడింది.. సెమీస్ లాంటి కీలక మ్యాచ్‌లో పక్కన పెట్టారు. రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, విరాట్ కోహ్లీలను ఓపెనర్లుగా ఆడించి ప్రయోగాలు.. చేసి వరల్డ్ కప్‌లో మాత్రం ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌నే కొనసాగించారు. ఇలా ద్రవిడ్ టోర్నీకి ముందు ఒకటి అనుకోని ఇక్కొటి చేయడంతో.. అంతకుముందు ప్రణాళికలంటూ చేసిన ప్రయోగాలన్ని వ్యథా అయ్యాయి.
ఇక వరల్డ్ కప్ ముగిసిన తర్వాత.. వెంటనే న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. కొంతమంది ఆటగాళ్లకు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా రెస్ట్ ఇచ్చిన బోర్డు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కూడా రెస్ట్ ఇచ్చింది. అయితే ఇదే విషయంపై స్పందించిన మాజీ కోచ్ రవిశాస్త్రి.. ద్రవిడ్‌కు రెస్ట్ ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. అసలు సపోర్టింగ్ స్టాఫ్‌కు రెస్ట్ అవసరం ఏముందని.. ఐపీఎల్ సమయంలో ఎలాగో రెండు నెలల పాటు ఫుల్ రెస్ట్ దొరుకుతుంది కదా అని అన్నాడు. నేను కనుక కోచ్‌గా ఉంటే.. ఆటగాళ్లతోనే ఉండి వారిని గమనించేవాడినని రవిశాస్త్రి అన్నాడు. కాగా.. రవిశాస్త్రి వ్యాఖ్యలతో చాలా మంది క్రికెట్ అభిమానులు సైతం ఏకీభవిస్తున్నారు.
Ravi Shastri raises a question over current Indian coaching staff taking breaks.#RaviShastri #RahulDravid #IndianCricketTeam #cricketTwitter pic.twitter.com/HZsFZB4MMF
— CricTracker (@Cricketracker) November 17, 2022