బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలుత తడబడినా.. తర్వాత పుంజుకుంది. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలో రాణించి.. జట్టును ఆదుకున్నారు. సాయంత్రం టీ బ్రేక్ సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి 82 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. పుజారా 89, శ్రేయస్ అయ్యర్ 75 పరుగులతో సెంచరీల వైపు సాగుతున్నారు. అయితే.. ఆరంభంలో 48 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 1-2తో ఓడిపోయిన టీమిండియాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో రెండో వన్డేలో గాయపడిన రోహిత్.. మూడో వన్డేతో పాటు, తొలి టెస్టుకు సైతం దూరం అయ్యాడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు.
అయితే.. టెస్టు ప్రారంభానికి ముందు అగ్రెసివ్ గేమ్ ఆడుతామని చెప్పిన కెప్టెన్ రాహుల్.. ఆటలో మాత్రం చూపించలేదు. యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్.. నిదానంగా ఆడాడు. ఈ క్రమంలోనే గిల్ 40 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే రాహుల్ సైతం 54 బంతుల్లో 22 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఇలాంటి స్థితిలో వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను సరిదిద్దాల్సిన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం చేతులు ఎత్తేశాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ వేసిన అద్భుతమైన బంతికి కోహ్లీ వద్ద సమాధానం లేకపోయింది. దీంతో ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లీ.. పెవిలియన్ చేరాడు.
అంతకు ముందు.. అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. విరాట్ కోహ్లీ రివ్యూ కోరాడు. తైజుల ఇస్లామ్ వేసిన సూపర్ బాల్‌కు వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. అంపైర్ సైతం మరో ఆలోచన లేకుండా దాన్ని అవుట్‌గా ప్రకటించాడు. కానీ.. కోహ్లీ మాత్రం డీఆర్‌ఎస్ కోరుకున్నాడు. ఇక రివ్యూలోనూ అది క్లియర్‌గా అవుట్ అని తేలడంతో కోహ్లీ పెవిలియన్ వైపు నడవక తప్పలేదు. ఈ విషయంపై క్రికెట్ అభిమానులు కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సీనియర్ ప్లేయర్ అయిఉండి.. అంత క్లియర్‌గా అవుట్ అయి తెలిసినా.. రివ్యూ కోరడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. అనవసరంగా ఇండియాకు ఒక రివ్యూ లాస్ చేశావ్ అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. స్టంప్‌లైన్‌కు అటూ ఇటూ ఉన్నా, బ్యాట్ ఎడ్జ్ తీసుకుందనే అనుమానం ఉన్నా.. ఆటగాళ్లు రివ్యూ తీసుకుంటారు. కోహ్లీ కూడా బ్యాట్ ఎడ్జ్ అయిఉంటుందనే డౌట్‌తో రివ్యూ కోరాడంటూ.. మరి కొంతమంది కోహ్లీని సపోర్ట్ చేస్తున్నారు. మరి కోహ్లీ రివ్యూ కోరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Watch: Taijul Islam’s terrific delivery that outfoxed Virat Kohli on Day 1 of India vs Bangladesh first Test@imVkohli https://t.co/Jm4pEK1X8U#ViratKohli #INDvBAN pic.twitter.com/5smOzvdI4j
— Sports Tak (@sports_tak) December 14, 2022
A Unplayable ball from Taijul Islam to dismissed Virat Kohli #INDvsBAN #BANVSIND #CricketTwitter pic.twitter.com/B0kuFxkXQR
— Cricket With Laresh (@Lareshhere) December 14, 2022