ఐపీఎల్ 2022 సీజన్ ఫుల్ జోష్ తో నడుస్తోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ లో పరుగులు వరదలా పారుతున్నాయి. ఒక మ్యాచ్ ను మించి మరో మ్యాచ్ జరుగుతోంది. టీవీల ముందు కేకలు పెడుతున్న ఐపీఎల్ అభిమానులకు ఇప్పుడు బీసీసీఐ ఓ శుభవార్త చెప్పేసింది. ఇప్పటివరకు స్టేడియాల్లో కేవలం 25 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంది. కరోనా కారణంగా అభిమానులను నేరుగా మ్యాచ్ చూసేందుకు అనుమతించలేదు. ఇప్పుడు ఆ సంఖ్యను 50 శాతానికి పెంచనున్నారు. అందుకు బీసీసీఐ కూడా పచ్చజెండా ఊపేసింది.
ఇదీ చదవండి: CSK ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! ఆ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడు!
కరోనా కారణంగానే కేవలం 25 శాతం మంది ప్రేక్షకులతో మ్యాచ్ లు నడుస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. చాలాచోట్లు అసలు కొత్తకేసులు కూడా నమోదు కావడం లేదు. మహారాష్ట్రలో ప్రభుత్వం కరోనా ఆంక్షలను కూడా పూర్తిగా ఎత్తేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ప్రేక్షకుల సంఖ్యను 50 శాతానికి పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్లో టికెట్స్ కూడా విక్రయించేందుకు సిద్ధమైపోయింది. ఏప్రిల్ 6 నుంచి ప్రేక్షకుల కోలాహలంతో స్టేడియాలన్నీ కళకళలాడనున్నాయి. ప్రస్తుతం ముంబైలోని బ్రబోర్న్, వాంఖడే, డీవై పాటిల్, పూణే ఎంసీఏ స్డేడియాల్లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 సీజన్ విజేత ఎవరు కానున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.