SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » After Falling 5 Wickets For 9 Runs Indian Bowlers Failed To Allout South Africa In 1st T20

9 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చినా.. టీమిండియా బౌలర్ల వైఫల్యం బట్టబయలు!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
9 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చినా.. టీమిండియా బౌలర్ల వైఫల్యం బట్టబయలు!

భారత్‌-సౌతాఫ్రికా మధ్య బుధవారం జరిగిన తొలి టీ20లో పిచ్‌ బౌలర్లకు అనుకూలించింది. టాస్‌ గెలవడంతో మారుమాట్లాడకుండా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ ఎంచుకన్నాడు. కెప్టెన్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వందకు వందశాతం నిజం చేస్తూ.. టీమిండియా పేసర్లు రెచ్చిపోయారు. సౌతాఫ్రికా టాపార్డర్‌ను అతలాకుతలం చేసి పడేశారు. తొలి ఓవర్‌లో ఒక వికెట్‌, రెండో ఓవర్‌లో ఏకంగా 3, మూడో ఓవర్‌లో ఇంకో వికెట్‌ తీసి.. కేవలం 9 పరుగులకే సగం మంది సౌతాఫ్రికా టాప్‌క్లాస్‌ బ్యాటర్లను పెవిలియన్‌ చేర్చారు. అసలు ఏం జరుగుతుందో కూడా సౌతాఫ్రికా బ్యాటర్లకు అర్థం కాలేదు. తొలి ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ ప్రొటీస్‌ కెప్టెన్‌ టెంబా బావుమాను బౌల్డ్‌ చేయగా.. రెండో ఓవర్‌ వేసిన అర్షదీప్‌ సింగ్‌ అద్భుతమైన ఇన్‌ అండ్‌ అవుట్‌ స్వింగర్లతో క్వింటన్‌ డికాక్‌, రోసోవ్‌, డేవిడ్‌ మిల్లర్‌లను ఒకే ఓవర్‌లో అవుట్‌ చేసి సంచలన బౌలింగ్‌ వేశాడు. ఆ మరోసటి ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ను అవుట్‌ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయి దారుణ పరిస్థితితుల్లో పడిపోయింది.

Advertisement

ఇక ఇక్కడి నుంచి మరెంతో సేపు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ సాగదని ప్రతి క్రికెట్‌ అభిమాని అనుకున్నాడు. ఎందుకంటే పిచ్‌ అంతలా బౌలర్లకు సహకరిస్తుంది. అర్షదీప్‌, దీపక్‌ చాహర్‌ నిప్పులు చెరుగుతున్నారు. మరో పేసర్‌ హర్షల్‌పటేల్‌ కూడా ఉన్నాడు. దీంతో సౌతాఫ్రికా కనీసం 50 పరుగులు కూడా దాటదని అంతా ఫిక్స్‌ అయ్యారు. కానీ.. సౌతాఫ్రికా సీనియర్‌ ప్లేయర్‌ మార్కరమ్‌(25), ఆల్‌రౌండర్‌ పార్నెల్‌(24), స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌(41) పరుగులు చేసి సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. ఇక్కడ ఈ ముగ్గురి పోరాటాన్ని ప్రశంసించడంతో పాటు.. టీమిండియా బౌలర్ల వైఫల్యంపై కూడా ఒక లుక్‌ వేయాల్సిన అవసరం ఉంది. 3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా ఆలౌట్‌ కాకుండా 106 పరుగులు చేయగలిగింది అంటే అది కచ్చితంగా భారత్‌ బౌలర్ల వైఫల్యాన్ని సూచిస్తుంది. పైగా బౌలింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్‌పై సౌతాఫ్రికాను ఆలౌట్‌ చేయలేకపోవడంపై టీమిండియా బౌలర్లపై విమర్శలు వస్తున్నాయి.

టీ20 వరల్డ్‌ కప్‌ 2022కు ముందు ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే మన బౌలర్లు చేసిన ప్రదర్శన అద్భుతంగా ఉన్నా.. అది పిచ్‌ పరిస్థితుల వల్లే సాధ్యమైంది. బంతి ఊహించని విధంగా స్వింగ్‌ అయింది. కానీ.. బంతి కొంత పాతబడ్డ తర్వాత పిచ్‌ను అంతగా సహకారం లభించకపోవడంతో భారత బౌలర్లు తేలిపోయారనే చెప్పాలి. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్‌ చేరిన తర్వాత కూడా సౌతాఫ్రికాను ఆలౌట్‌ చేయలేకపోయారు. ఇప్పటి వరకు టీ20ల్లో కేవలం 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ అత్యధికంగా ఉన్న స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ సైతం మన బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 41 పరుగులు సాధించాడు. మార్కరమ్‌ ఎక్రాస్‌ది షాట్‌ ఆడి దురదృష్టవశాత్తు ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. లేకుంటే సౌతాఫ్రికా మరింత మంచి స్కోర్‌ను టీమిండియా ముందు ఉంచగలిగేది.

కేవలం 3 ఓవర్లలోనే 5 వికెట్లు దక్కినా టీమిండియా బౌలర్లు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయలేకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మ్యాచ్‌లో ఒక్కసారి పట్టు దొరికితే దాన్ని మరింత బిగించాలి కానీ.. జార విడువ కూడదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదే తప్పు చేశారు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఎటాకింగ్‌ బ్యాటింగ్‌తో టీమిండియా ఈ మ్యాచ్‌​ గెలిచింది. కానీ.. అతను ఆడకపోయి ఉంటే పరిస్థితి కచ్చితంగా మరోలా ఉండేది. లేదా సౌతాఫ్రికా మరో 30, 40 పరుగులు చేసి ఉన్నా.. విజయం కచ్చితంగా కష్టమయ్యేది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారనే కంటే పిచ్‌ అనుకూలించింది అనడమే ఉత్తమం.

5 wickets summed up in 11 seconds. Watch it here 👇👇
Don’t miss the LIVE coverage of the #INDvSA match on @StarSportsIndia pic.twitter.com/jYeogZoqfD

— BCCI (@BCCI) September 28, 2022

ఇది కూడా చదవండి: పాక్‌ ప్లేయర్‌ రిజ్వాన్‌ వరల్డ్‌ రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌!

Tags :

  • Arshdeep Singh
  • Cricket News
  • Deepak Chahar
  • India vs South Africa
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

Most viewed

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam