భావోద్వేగాలు ఆటగాళ్లలోనే కాదు.. ఆట చూసే వాళ్లలోనూ తన్నుకొస్తాయి. ఆటగాడి కుటుంబసభ్యులైతే ఇంకా ఎక్కువగా ఇన్వల్వ్ అయిపోతారు. అలాంటి సంఘటనే నిన్న రాత్రి ఆర్సీబీ, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మంచి ప్రదర్శనతో పటిష్టస్థితిలో ఉన్న ఆర్సీబీకి తన 360 డిగ్రీ హిట్టింగ్తో మరింత భారీ స్కోర్ అందించేందుకు క్రీజ్‌లోకి వచ్చిన ఏబీడీ అందుకు తగ్గంటే ఒక సిక్స్, ఫోర్‌తో రాగానే కోత మొదలెట్టాడు. ఇక స్కోరు పరుగులు పెట్టడం ఖాయం అనుకున్న తరుణంలో ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. డివిలియర్స్ అవుట్ అవ్వడంతో ముంబై ప్లేయర్ల ఆనందానికి అవధులు లేవు.
కానీ ఈ మ్యాచ్‌ను స్టేడియంలో ఉండి ప్రత్యేక్షంగా చూస్తున్న ఏబీడీ కొడుకు మాత్రం తండ్రి అవుట్ అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కట్టలుతెంచుకున్న కోపంతో ముందున్న కుర్చీని చేత్తో గుద్దాడు. ఆ చిన్నారి కోపంతో కుర్చీని కొట్టిన దెబ్బ అతన్నే నొప్పికి గురిచేసింది. కోపంలో ఏదో కొట్డాడుగాని నొప్పితో వెంటనే ఏడుపు అందుకున్నాడు. మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితిల్లో నైనా డివిలియర్స్ కామ్ అండ్ కూల్‌గా ఉంటే అతని కొడుకు మాత్రం కోహ్లీలా అగ్రేసివ్గా కనిపిస్తున్నాడు. క్రికెట్ అంటే అంతే చిన్నా పెద్ద తేడా ఉండదు అంతలా భావోద్వేగానికి గురి చేసే ఉత్కంఠ క్రికెట్ సొంతం. భారీ స్కోర్ చేస్తుందనుకున్న ఆర్సీబీ 165 పరుగులకే పరిమితం అయింది. అయినా కూడా ముంబైను 111కే ఆలౌట్ చేసి 54 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తండ్రి తక్కువ స్కోర్‌కే అవుట్ అయినా మ్యాచ్ మాత్రం ఆర్సీబీ గెలవడంతో కొంచం శాంతించినట్లు ఉన్నాడు.
Me after watching bhaubali
#RCBvsMI pic.twitter.com/Oe0QJb6XgS— ANMOL KAUR (@anmol_banga) September 26, 2021