ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ బూతుల పంచాయతి నడుస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. పట్టాభిని పోలీసులు తన నివాసంలో తలుపులు పగలగొట్టి బుధవారం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇదే అంశంపై స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించారు.
ముఖ్యమంత్రి అంటే కోట్ల మంది ప్రజలచే ఎన్నుకోబడ్డ కాంస్టిట్ట్యూషనల్ హెడ్. అలాంటి వ్యక్తిని కూడా బోషడీకే అని తిట్టగలుగుతున్నారు. బోషడీకే అంటే ల*జాకొడుకు అని అర్థం. ఇలా తిట్టి ముఖ్యమంత్రిని అభిమానించే వాళ్ళని రెచ్చగొట్టాలని, రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని ఆరాటపడడం సమంజసమేనా ? అని సీఎం జగన్ మోహన్ రెడ్డి పోస్ట్ చేయడం విశేషం. సీఎం స్థాయి వ్యక్తిని ఇలాంటి మాటలు అనడంతో దాడులు జరగాయన్నది వైసీపీ నాయకుల వాదన. కానీ.., ఈ విషయంలో ఎలా అయినా సింపతీని కొట్టేయాలని టీడీపీ చూస్తోంది. టీడీపీ నాయకులు కూడా ఈ దిశగా తమ వాదనలను సమర్ధించుకుంటూ దీక్షలు చేస్తున్నారు. అయితే.. ఇలాంటి సమయంలో నారా లోకేశ్ బోసిడికే అన్న మాట విషయంలో తమ తప్పుని ఒప్పుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బోసిడికే అన్న మాటకి అర్ధం నాకు తెలియదు. ఇప్పుడే దాని అర్ధం వెతికాను. ఆ అర్ధం ఇది అంటూ లోకేశ్ చెప్పుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ నాయకులు మాత్రం ఆ మాటలో అంత అర్ధం లేదు అని వాదిస్తున్న సమయంలో.. లోకేశ్ నుండి ఇలాంటి ఓ వీడియో బయటకి రావడం టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.