టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీసీ జనాభా ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన లేఖలో వివరించారు. అయితే బీసీ జనగణన విషయంలో సరైన సమాచారం లేకపోవటం వల్ల బీసీ జనాభాకు అభివృద్ధి ఫలాలు దక్కటం లేదని చంద్రబాబు లేఖలో వివరించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు త్వరలో బీసీ గణన చేపట్టాలని ప్రధానికి విజ్ణప్తి చేశారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో బీసీ జనగణన కోసమని అసెంబ్లీలో ఏకగ్రీన తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ఇప్పుడున్న కులాల వారీగా అందుబాటులో ఉన్న కులాల లెక్కలు 90 ఏళ్ల క్రితం నాటి సమాచారమని, అదే వివరాలతో ఇప్పుడు కులాల వారీగా అమలు చేస్తే అన్ని బీసీ వర్గాలకు అభివృద్ధి జరగటం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ప్రధాని మోదీ తమ లేఖపై స్పందించి త్వరలో నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.