Nupur Sharma: నూపుర్ శర్మను హత్య చేసేందుకు దేశ సరిహద్దుల్లోకి వచ్చిన పాకిస్థానీ వ్యక్తిని.. భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్ ) అధికారులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ బోర్డర్ ను దాటి భారత్ లో ప్రవేశిస్తుండగా అధికారులు పాకిస్తానీ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ లో, శ్రీ గంగానగర్ జిల్లాలో జూలై 16న ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో హిందూమల్కోట్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద అనుమానాస్పద రీతిలో కనిపించిన వ్యక్తిని బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించిన పోలీసులు.. అతన్ని రిజ్వాన్ అశ్రఫ్ గా గుర్తించారు. పాకిస్తాన్ లోని కుతియాల షైకన్ గ్రామవాసి అని పోలీసుల విచారణలో వెల్లడైంది.
కాగా రిజ్వాన్ నుండి 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కత్తులతో పాటు బ్యాగులో ఇస్లాం మతానికి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, ఆహారం, మట్టి ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను చంపేందుకే తాను దేశం దాటి వచ్చినట్లు రిజ్వాన్ ప్రాధమిక విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించగా.. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 8 రోజుల కస్టడీ విధించింది. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ బ్యూరో, రా ఏజెన్సీ, ఇతర నిఘా సంస్థల బృందాలు నిందితుడ్ని విచారిస్తున్నాయి.
#FourKaFire: नूपुर शर्मा को बड़ी राहत, SC ने 10 अगस्त तक गिरफ्तारी पर रोक लगाई, वहीं नूपुर शर्मा की हत्या के इरादे से आए पाकिस्तानी घुसपैठिया गिरफ्तार
अपडेट दे रहे हैं संवाददाता @bhanwarpushpen2@Swatij14 @anchor_barkha @jyotimishra999 @SwetaSri27 #NupurSharma pic.twitter.com/45qD3Q7zSw
— Times Now Navbharat (@TNNavbharat) July 19, 2022
Sri Ganganagar, Rajasthan | He said he came to India to take action against Nupur Sharma on her statements. He had no idea where she lives, he was only so religiously motivated that he crossed over: SP Anand Sharma (2/2) pic.twitter.com/Zh4rDfUsJm
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 19, 2022
ఇది కూడా చదవండి: వీడియో: నడిరోడ్డుపై కామాంధుడి వికృత చేష్టలు..!
ఇది కూడా చదవండి: Krishna District: భర్త కూలీ.. ప్రియుడు పోలీస్! అత్యాశకి పోయి ఓ భార్య దారుణం!