భారతదేశ రవాణా రంగంలో రైల్వే సంస్థ సేవలు మరువలేనివి. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ఉన్నప్పటికీ.. సుదూర ప్రయాణాలు సాగించే వారు మాత్రం రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే.. ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రయాణికులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో వారితో తీసుకెళ్లకూడదు. ఒకవేళ ప్రయాణికులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
రైలు ప్రయాణంలో బాణసంచా, గ్యాస్ సిలిండెర్, గన్‌పౌడర్ లాంటి పేలుడు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించారు. అంతేకాదు.. ఎండు గడ్డి, కిరోసిన్, యాసిడ్, అగ్గిపెట్టెలు, పెట్రోల్ వంటి మండే వస్తువుల రవాణ కూడా చట్ట విరుద్దం. అలాగే రైల్వే కంపార్ట్‌మెంట్ లేదా స్టేషన్‌లో ధూమపానం చేయడం నిషేధించారు. వీటిని అతిక్రమించినట్లయితే.. రైల్వే చట్టం 1989, సెక్షన్ 164, 165 ప్రకారం రైలులో ప్రయాణించే సమయంలో పేలుడు పదార్థాలను రవాణా చేస్తే రూ. 1000 వరకు జరిమానా లేదా మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నిషేధ వస్తువులను తీసుకెళ్తూ.. మీరెప్పుడైనా ఇలాంటి వింత అనుభవాలను ఎదుర్కున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ट्रेन में यात्रा के दौरान ज्वलनशील पदार्थ जैसे मिट्टी का तेल , पेट्रोल, पटाखे एवं गैस सिलेंडर इत्यादि ज्वलनशील सामग्री न स्वयं लेकर चलें और न ही किसी को ले जाने दें यह एक दंडनीय अपराध है l @BhopalDivision @drmkota pic.twitter.com/QtzOxlJIp2
— West Central Railway (@wc_railway) March 30, 2021