పెట్రోల్, డీజిల్ లేకుంటే వాహనాలు నడుస్తాయా? నడవవు. వీటి అవసరం ఎంతన్నది వాహనాలు ఉన్నవారికి తెలుస్తుంది. ఈ మధ్య అంటే.. ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి.. కానీ, ప్రస్తుతమున్నవన్నీ పెట్రోల్, డీజల్ వాహనాలే కదా!. ఇవేమీ పట్టించుకోకుండా ఓ రాష్ట్ర ప్రభుత్వం.. సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్ పోస్తాం.. లేదంటే పోయమంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది? ఏ సర్టిఫికేట్ ఉండాలన్నది ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత గురుంచి అందరకి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్య నగరం ఏదంటే.. ఢిల్లీనే. ఇక్కడ వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్ళు తగ్గిపోతోందని నివేదికలు తెలిపాయంటే.. అర్థం చేసుకోవచ్చు.. ఏ రేంజులో కాలుష్యముందన్నది. అందులోనూ శీతాకాలం సమీపిస్తున్నదంటే ఢిల్లీ వాసులు గజగజ వణికిపోతారు. చలికి కాదు.. కాలుష్యాన్ని వాయువులను పీల్చి ఎక్కడ ప్రాణాల మీదికి తెచ్చుకుంటామో అని. కొన్నిసార్లు అయితే సూర్యుడు కూడా కనిపించకుండా అంతా మబ్బుగా కాలుష్యం పేరి ఉండటాన్ని చూశాం. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా.. అవి స్వల్ప పరిధి మేరకే ఫలితాలు ఇచ్చాయి.
ఈ క్రమంలోఅరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి వాయు కాలుష్యంపై నజర్ పెట్టింది.15 పాయింట్ల యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యంపై తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నట్టు ప్రకటించింది. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు బయటకు తీసుకురావొద్దని తెలిపింది. పదేళ్ల దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాల పొల్యుషన్ సర్టిఫికేట్లను స్ట్రిక్ట్‌గా తనిఖీలు చేస్తామని ప్రకటించింది. ఈ నెల 25 నుంచి పెట్రోల్ బంకుల్లో పీయూసీ సర్టిఫికేట్ చూపించకపోతే, వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కొట్టదని ఆదేశాలు జారీ చేసింది.
Delhi govt. decided that petrol and diesel will not be provided without PUC (pollution under control) certificate at petrol pumps from October 25.#supremecourt #petrol #diesel #PUC #dailynews #news #law #dailybites #legalbitesacademy pic.twitter.com/R4jCfM60aw
— Legal Bites (@Legal_bites) October 1, 2022