అమరావతి- అఖండ.. నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అఖండ గురువారం ప్రపంచ వ్యాప్తందా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం విజయఢంకా మోగిస్తోంది. బాలకృష్ణ అభిమానులే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అఖండ సినిమా విజయం సాధించాలని కోరుకుందంటే విజయం కోసం అంతా ఎంత ఆరాటపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద హీరో మొట్టమొదటి సినిమా అఖండ. ముందు ముందు విడుదలకు కిద్దమవుతున్న పెద్ద సినిమాలకు బాలయ్య బాబు అఖండ దిశా నిర్దేశం చేసే సినిమాగా వచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అఖండ భారీ విజయం సాధించడంతో, తెలుగు సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తోంది.
మరోవైపు బాలకృష్ణ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు హ్యాపిగా ఉన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా అఖండ విజయం సందర్బంగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అఖండ భారీ విజయం పట్ల చంద్రబాబు, లోకేష్ లు సంతోషం వ్యక్తం చేశారు.
అఖండ విజయం సాధించిన ‘అఖండ’ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు.. అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ‘‘అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిన బాలా మావయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు థమన్, నటీనటులు, చిత్ర బృందానికి అభినందనలు.. ఎక్కడ విన్నా ఒక్కటే మాట…జై బాలయ్యా.. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి భారీ హిట్ రావడంతో టాలీవుడ్ మంచి ఉత్సాహంతో ఉంది.
అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు.#Akhanda
— N Chandrababu Naidu (@ncbn) December 2, 2021
అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిన బాలా మావయ్య, దర్శకుడు #BoyapatiSreenu, సంగీత దర్శకుడు @MusicThaman, నటీనటులు, చిత్ర బృందానికి అభినందనలు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట…జై బాలయ్యా. #Akhanda #BalaKrishna pic.twitter.com/THN7mSGs6i
— Lokesh Nara (@naralokesh) December 2, 2021