మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రావడం రావడమే సంక్రాంతి పండుగను తీసుకొచ్చింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కైతే లైఫ్ లాంగ్ గుర్తెట్టుకునే సినిమాగా నిలిచిపోయింది. ఎందుకు ఈ సినిమా ఇంత ప్రత్యేకం అంటే.. ఈ సినిమా 80స్, 90స్ లోకి తీసుకెళ్లిపోతుంది ప్రేక్షకులని. ఆరోజుల్లో మెగాస్టార్ సినిమా అంటే పూనకాలు వచ్చేవి. ఆ జనరేషన్ యూత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే మధ్యలో బాస్ గ్యాప్ ఇచ్చి.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కానీ ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో బాస్ ఇమేజ్ కి తగ్గా సినిమా పడలేదనే చెప్పాలి. అంటే సగటు మాస్ ప్రేక్షకుడు, బాస్ అభిమానులు కోరుకునే మెగా మాస్ సినిమా, ఫంక్తు కమర్షియల్ సినిమా పడలేదనే చెప్పాలి. ‘మాకు భీభత్సం కావాలి, 80స్, 90స్ చిరంజీవి కావాలి’ అని కోరుకున్న ఫ్యాన్స్ కోరికను నెరవేర్చే సినిమా ఈ వాల్తేరు వీరయ్య.
అసలు బాస్ కి ఎందుకు ఈ వయసులో ఇంత కష్టపడటం. ఒళ్ళు హూనం చేసుకుని ఫైట్లు చేయడం, కష్టపడి స్టెప్పులు వేయడం, ఆ శ్రీదేవి, చిరంజీవి పాట కోసం గడ్డ కట్టే చలిలో ఎందుకు అంత కష్టం? ఏ బాస్ ఫైట్లు చేయకపోతే, డ్యాన్సులు చేయకపోతే జనం చూడరా? బాస్ కనబడితే చాలు అదే పెద్ద పండగని అనుకుంటారు. నిజానికి బాస్ బాడీకే ఒక లాంగ్వేజ్ ఉంది. ఆయన కళ్ళే నటిస్తాయి. ఆయన హావభావాలే మనసుకు హాయినిస్తాయి. భారీ ఫైట్లు, భారీగా డ్యాన్సులు చేయాల్సిన పని లేదు. అయినా గానీ చేస్తున్నారంటే దానికి కారణం అభిమానులు. నాకెందుకు ఇవన్నీ అవసరమా అని.. సుఖంగా సినిమాలు చేసుకునే అవకాశం ఉంది. అవకాశం ఉన్నా కూడా అభిమానుల కోసమే ఆలోచించి కష్టపడుతున్నారు.
అభిమానులు అంటే కుర్రాళ్ళు మాత్రమే కాదండోయ్. పెద్దవాళ్ళు కూడా. ముఖ్యంగా మహిళలు. బాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు వచ్చి.. వాటిలో హీరోల బొమ్మలు ఉంటున్నాయి గానీ ఒకప్పుడు ఇళ్లలో పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవి. చిరంజీవి సినిమా రిలీజ్ అయితే చాలు.. ఆ మూవీ పోస్టర్స్ ని ఇంట్లో గోడలకు తగిలించే వింటేజ్ అభిమానులు ఇప్పటికీ చిరు అభిమానులుగానే కొనసాగుతున్నారు. ఈ వింటేజ్ అభిమానుల కోసమే చిరు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. ఒకప్పుడు చిరంజీవిని ఎలా అయితే చూశారో.. చిరంజీవిని, చిరు సినిమాలని చూసి ఎలా అయితే కాలర్ ఎగరేసుకున్నారో.. మళ్ళీ అలానే ఇప్పుడు కాలర్ ఎగరేసుకునేలా చేయాలన్న సంకల్పం నుంచి వచ్చిందే వాల్తేరు వీరయ్య.
ఈ సినిమా అభిమానుల కడుపు నింపింది. ఫుల్ మీల్స్ పెట్టింది. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే.. ఇండస్ట్రీకి చిరంజీవి ఒక్కడే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత, ఇప్పటికీ టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న హీరో చిరంజీవి. చిరంజీవిని రీప్లేస్ చేసే హీరో గానీ, ఆ స్థానాన్ని అందుకునే హీరో గానీ ఇప్పటి వరకూ రాలేదు. ఇకపై రాలేరు కూడా అని మెగాభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రుద్రవీణ, స్వయంకృషి, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్, ఖైదీ, ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్ ఇలా చెప్పుకుంటూ పొతే చిరు కెరీర్ లో సారీ ఇండస్ట్రీలో ఎన్నో మాస్టర్ పీస్ మూవీస్ ఉన్నాయి. నిజానికి జనానికి కూడా అప్పటి చిరంజీవే కావాలి. అదే కోరుకుంటున్నారు. మళ్ళీ వింటేజ్ చిరుని గుర్తు చేసిన సినిమా ఈ వాల్తేరు వీరయ్య. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. ఈ విషయం అభిమానులు మాత్రమే కాదు, సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు, సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ప్రతీ ఒక్కరూ చెబుతున్నారు. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్.. వాల్తేరు వీరయ్య ఏ సాలిడ్ కమ్ బ్యాక్. మరి వాల్తేరు వీరయ్య సినిమాపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.