కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్ మూవీ ఎంతటి బిగ్ హిట్ అనేది అందరికీ తెలిసిందే. తాజాగా ప్రశాంత్ నుండి కేజీఎఫ్-2 రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాల మధ్య కేజీఎఫ్ 2 మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాఫియా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నుండి సలార్ సినిమా రాబోతుంది.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. సలార్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ కాంబోలో రాబోయే మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా వీరి కాంబినేషన్ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ ఏడాది దసరా టైంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా.. అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఎంపిక చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఎన్టీఆర్ – దీపికా కాంబినేషన్ సెట్ ఆయితే మాత్రం ప్రశాంత్ నీల్ మూవీ ఓ రేంజిలో ఉండబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఎన్టీఆర్ – ప్రశాంత్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.