గత రెండేళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారితో కొందరు.. ఇతర ఆరోగ్య కారణాల వల్ల మరికొందరు చనిపోయారు. సోమవారం ప్రముఖ నటులు సత్యజీత్ కన్నుమూసిన విషాదం మరువక ముందే తాజాగా మరో ప్రముఖ సీనియర్ తమిళ నటుడు శ్రీకాంత్ (82) మంగళవారం సాయంత్రం మృతి చెందారు. చెన్నైలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొన్నది.
ఈ విషయం తెలిసి ప్రముఖులు, రాజకీయ నేతలు.. శ్రీకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. 1965లో శ్రీధర్ దర్శకత్వంలో ‘వెన్నిరాడై’ చిత్రం ద్వారా శ్రీకాంత్ తమిళ చిత్రసీమకు పరిచయయ్యారు. ఆ తర్వాత శివాజీ గణేశన్, జయశంకర్, ముత్తురామన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలు నటించిన చిత్రాల్లో నటించారు. సుమారు రెండువందలకు పైగా తమిళ చిత్రాల్లో ఆయన నటించారు.
‘రాజనాగం’ (తెలుగులో ‘కోడెనాగు’) చిత్రంలో శ్రీకాంత్ హీరోగా నటించి యువతను బాగా ఆకట్టుకున్నారు. ‘నా ప్రియమైన స్నేహితుడు శ్రీకాంత్ మృతి పట్ల నేను తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ అని తమిళంలో రజనీకాంత్ ట్వీట్ చేశారు.
Tamil actor #Srikanth dies at 82, #Rajinikanth mourns his demise: ‘I am deeply saddened’https://t.co/jhiharmicK
— India TV (@indiatvnews) October 12, 2021