బుల్లితెర హీరో ‘సుడిగాలి సుధీర్’ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, ఆ తరువాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అటు మీదట వెండితెర మీద కూడా రాణిస్తున్నాడు. ఇక సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు‘ చిత్రం విడుదలకి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడు. ఈ సంధర్భంగా తన ఫ్యాన్స్ కి ఒక స్వీట్ న్యూస్ చెప్పాడు. సుధీర్ కెరీర్ లో జబర్దస్త్ ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. గత కొన్ని నెలలుగా సుధీర్ ఆ షోలో కనిపించడం లేదు. దీంతో.. సుధీర్ వెండితెర అవకాశాల కోసం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను సైతం వదిలిపెట్టి వెళ్ళాడు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. మల్లెమాలలో తనకు అవమానం జరిగినట్లుగా, అందుకే తప్పుకున్నట్లుగా పలు రకాలు కథనాలు కూడా బయటకొచ్చాయి. తాజాగా సుమన్ టీవీ కి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవన్నీ గాలి వార్తలు అని సుధీర్ కొట్టి పారేశాడు.
“6 నెలలు క్రితం నేను కొంతవరకు ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాను. దీంతో.. జబర్దస్త్ యాజమాన్యానికి నా పరిస్థితి చెప్పుకుని బయటకి వచ్చాను. ఇప్పుడు అన్నీ సాల్వ్ అయ్యాయి. నేను పడ్డ కష్టాలన్నీ వారికి వివరించాను. మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అందు వారు సరే అన్నారు. త్వరలోనే మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నాను” అని సుధీర్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పాడు. ఇక జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళాక సుధీర్ కి బుల్లితెర పై ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. హీరోగా కాస్త బిజీ అయినా.. హోస్ట్ గా మాత్రం తన స్థాయికి తగ్గ షోస్ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ మళ్ళీ జబర్దస్త్ లోకి కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. త్వరలోనే సుధీర్ జబర్దస్త్ నవ్వులు పంచాలని కోరుకుందాం..