ప్రతివారం బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న వినోదాత్మక టీవీ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపనీ’ ఒకటి. ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న కామెడీ షోలు జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోల తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో అంతటి క్రేజ్ తెచ్చుకుంది. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పుడు నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే.. ఆదివారం ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగే ప్రోమో చాలా సందడిగా సాగింది. అదీగాక ఈ వారం ‘బంగారం ఒకటి చెప్పనా’ అనే కాన్సెప్ట్ తో ఎపిసోడ్ జరగనుంది. ఈ ఎపిసోడ్ లో దేవత సీరియల్ జోడి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఈ క్రమంలో స్టేజిపై కమెడియన్ హైపర్ ఆది చేసిన హంగామా మామూలుగా లేదు. ముందు కృష్ణభగవాన్, అన్నపూర్ణలతో కలిసి స్కిట్ చేసిన ఆది.. ఆ తర్వాత ‘ఊ అంటావా మావ’ పాటకు స్టేజిపై డాన్స్ చేయడం విశేషం. అయితే.. మూవీలో అల్లు అర్జున్, సమంత వేసిన ఫ్లోర్ స్టెప్ ని.. ఆది వేరే అమ్మాయిలతో చేయడానికి ట్రై చేశాడు. కానీ.. ఇద్దరమ్మాయిలతో ప్రయత్నించినా స్టెప్ వేయడంలో విఫలం అయ్యాడు. ప్రస్తుతం ఆది చేసిన డాన్స్ కి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి ఈ వారం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.