తాజాగా రవీందర్ జన్మదినం సందర్భంగా తన భర్తకు 6 అడుగుల సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరిచింది మహాలక్ష్మి. భర్త పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్ చేసి, గిఫ్ట్ ఇచ్చిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
పాపులర్ కోలీవుడ్ నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పొట్టిగా, నాజూగ్గా ఉండే మహాలక్ష్మి, భారీ కాయంతో ఉన్న తమిళ్ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్‌ను వివాహం చేసుకోవడమే దీనికి కారణం. డబ్బు కోసమే ఆమె, నిర్మాతను మ్యారేజ్ చేసుకుందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. అతిగా బరువు ఉండడం వల్ల రవీందర్‌ను బాడీ షేమింగ్ చేశారు. వీరి పెళ్లయ్యి రెండు సంవత్సరాలయింది. ఈ రెండేళ్లల్లో వీరిని బాగానే ట్రోల్ చేశారు. ఇంకా తల్లివి కాలేదేంటి? అంటూ మహాలక్ష్మిని ప్రశ్నించారు. అలాగే ఈ జంట విడాకులు తీసుకుంటుందని పుకార్లు కూడా పుట్టించారు. అయితే, ఎన్ని రూమర్స్ వచ్చినా.. అవేవీ తమను బాధించవని, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి హ్యాపీగానే ఉన్నామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు వీరు.
ఇదిలా ఉంటే.. తాజాగా రవీందర్ జన్మదినం సందర్భంగా తన భర్తకు 6 అడుగుల సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరిచింది మహాలక్ష్మి. భర్త పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్ చేసి, గిఫ్ట్ ఇచ్చిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె, తన శ్రీవారికి ఏం బహుమతి ఇచ్చిందో తెలుసా?.. ఆరడుగుల ఎత్తులో రవీందర్ ఫోటోను చక్కగా పెయింటింగ్ చేయించి పుట్టినరోజు కానుకగా ఇచ్చింది.
భర్తకు విషెస్ తెలియజేస్తూ.. ‘నాకు మళ్లీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరే నా బలం, అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని’ అంటూ రాసుకొచ్చిందామె. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. రవీందర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ, నెగిటివ్ కామెంట్స్ చేసే వారిని పట్టించుకోకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్యాలని కామెంట్స్ చేశారు.