ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చెన్నైలో తళుక్కుమన్నారు. గురువారం నగరంలో జరిగిన ‘మెటా క్రియేటర్ ఈవెంట్’కు స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. రెడ్ డ్రెస్‌లో ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోరిక మేరకు ఆమె ఓ పాటకు కాళ్లు కదిపారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని ‘‘వాది కమింగ్’’ పాటకు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ ఫ్లోర్‌ను తన స్టెప్పులతో హీటెక్కించారు.
అంతేకాదు.. ఈవెంట్‌లో కెమెరాముందు ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తమన్నా ఫొటోలు, వీడియోలు చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ ఫ్యాన్ పేజీల్లో వాటిని పోస్ట్ చేసుకుని సంబరపడిపోతున్నారు. కాగా, తమన్నా నటించిన తాజా హిందీ చిత్రాలు ‘బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ప్రస్తుతం తమన్నా రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోలా శంకర్ కాగా.. మరొకటి గుర్తుందా శీతాకాలం. ఈ సినిమాలు శరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. తమన్నా వీటితో పాటు బంద్రా అనే మలయాళ సినిమాలోనూ నటిస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ షోలు, బయట ఈవెంట్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.
Tammu spotted at airport #Tamannaah #TamannaahBhatia pic.twitter.com/02UNYu9js1
— Miss B fan(Tammu fan😘❣️) (@MissB_Fan) October 27, 2022