ఈ మధ్యకాలంలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టర్స్ నుండి స్టార్స్ వరకు అంతా వెండితెర పై సినిమాలతో పాటు అవకాశం రాగానే డిజిటల్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వీలు కుదిరినప్పుడల్లా సినిమాలతో పాటు ఓటిటిలో వెబ్ సిరీస్ లు చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా లాంటి డిజిటల్ వేదికలపై ఎంట్రీలు ఇచ్చేశారు.
తాజాగా మరో టాలీవుడ్ స్టార్ ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాగే చేతిలో డైరెక్టర్ శంకర్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలు లైనప్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకోనున్న రామ్ చరణ్.. త్వరలోనే డిజిటల్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్.. రామ్ చరణ్ తో ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టిందట. అందుకు సంబంధించి రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ టీమ్ చర్చలు జరపనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం నెట్ ఫ్లిక్స్ హాలీవుడ్ సిరీస్ కంటెంట్ రెడీ చేస్తుందని, అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే వెబ్ సిరీస్ పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. మరి రామ్ చరణ్ డిజిటల్ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.