ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేయిటింగ్ సినిమా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో భారీ స్థాయిలో జరుగుతోంది. జనం పెద్ద సంఖ్యలో ఈవెంట్‌లో పాల్గొన్నారు. కొన్ని వేల మంది ఫ్యాన్స్‌తో ఆ ప్రాంతం మొత్తం ఇసుక వేస్తే రాలనంతగా మారిపోయింది. అయితే, కొంత సేపటి క్రితం ఈవెంట్ జరుగుతున్న ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అయినప్పటికి ఫ్యాన్స్ వెనక్కు తగ్గలేదు. వర్షంలో తడుస్తూ అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు పరిస్థితి కొంత సద్దుమణిగింది. అప్పుడప్పుడు చినుకులు మాత్రమే కురుస్తున్నాయి.
కాగా, భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘ఆదిపురుష్’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో విడుదలైన ట్రైలర్ వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రికార్డులు సృష్టించాయి. అయితే, గతంలో విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్ విపరీతమైన ట్రోలింగ్స్‌ను ఎదుర్కొంది. చిన్న పిల్లల యానిమేషన్ వీడియోలా ఉందంటూ ఆఖరికి ఫ్యాన్స్ కూడా టీజర్ వీడియోపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీజర్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో చిత్ర బృందం దిద్దుబాటు చర్యలకు దిగింది. సినిమా మేకింగ్‌లో కీలక మార్పులు చేసింది. దీంతో అద్భుతమైన అవుట్ పుట్ వచ్చింది. ఇక, ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాయనుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి, ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. మరి, ఆదిపురుష్ ఈవెంట్‌కు లక్షల ఫ్యాన్స్ రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.