పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి విడుదలకు మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా మరోసారి వాయిదా పడాల్సి వచ్చింది. రాధేశ్యామ్ రిలీజ్ కోసం చిత్రబృందం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ జరిపింది.
రాధేశ్యామ్ వాయిదా పడేసరికి మళ్లీ రిలీజ్ ఎప్పుడనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. రాధేశ్యామ్ వాయిదా పడినా సినిమాకి సంబంధించి బజ్ మాత్రం అలాగే ఉంది. ముఖ్యంగా రాధేశ్యామ్ సాంగ్స్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది.
The 12 min ship sequence is said to be the BIGGEST highlight of #RadheShyam.#Prabhas
— Manobala Vijayabalan (@ManobalaV) January 18, 2022
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ.. రాధేశ్యామ్ క్లైమాక్స్ ఓ రేంజిలో ఉండబోతుందని చెప్పి అంచనాలు పెంచేశాడు. కానీ తాజాగా మరో వార్త అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తోంది. రాధేశ్యామ్ సినిమాలో దాదాపు 12 నిమిషాల షిప్ సీక్వెన్స్ ఉందని, అది సినిమాకే హైలైట్ కాబోతుందని ట్విట్టర్ వేదికగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ట్వీట్స్ ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. మరి రాధేశ్యామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.