రాధేశ్యామ్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళితో కలిసి చేసిన లేటెస్ట్ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. ఒకవైపు ప్రభాస్ రాధేశ్యామ్, మరోవైపు రాజమౌళి RRR సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో RRR గురించి ప్రభాస్ మాట్లాడిన మాటలు, దానికి రాజమౌళి చెప్పిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘చరణ్, తారక్ లాంటి ఇద్దరు స్టార్లను పెట్టి ఆర్ఆర్ఆర్ తీసావ్ బాగుంది. నన్ను కనీసం గెస్ట్ అప్పీయరెన్సుగా పిలవాలని అనిపించలేదా? నేను, చరణ్, తారక్ ముగ్గరి బాండింగ్ బాగుండేది కదా!.. ఆ డౌట్ రాలేదా లేక మీరు అనుకున్న విజన్ లో నేను కనిపించలేదా?’ అని ప్రశ్నించాడు. వెంటనే స్పందించిన రాజమౌళి.. ‘నువ్వు ఒక పెద్ద షిప్ లాంటోడివి ప్రభాస్.. అక్కడ సీన్ లో షిప్ అవసరం ఉందంటే నిన్ను పిలుస్తాం..ఓకే అడగ్గానే వస్తాడు కదా అనుకుంటే.. సినిమా బాగోదు’ అన్నాడు.
‘సరే.. లే ఇంకా నాకు అర్థమైంది. మీకు నాకంటే చరణ్, తారక్ ఎక్కువ ఇష్టమని అర్థమైందిలే’ అని అలిగాడు ప్రభాస్. నీకొకటి చెప్పాలా.. నేను ఆ సినిమా చేసినప్పుడు ఆ హీరోలు తప్ప ఇంకెవరు గుర్తురారు’ అనేశాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ప్రభాస్ – రాజమౌళి ఇంటర్వ్యూ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.