పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా స్టార్ట్ చేయడం లేటు. సోషల్ మీడియా ఆ ప్రాజెక్టు గురించి తెగ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నిలిచిన మూవీ ‘OG’. డైరెక్టర్ సుజీత్ పవన్ తో తీయబోయే సినిమాకు ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఫైనల్ గా పేరు ఏం పెడతారనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మధ్యే పూజా కార్యక్రమం జరగ్గా.. ఈ సినిమా కోసం ఎవరెవరు పనిచేస్తున్నారనేది ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికైతే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నాడనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ ఎవరనేదానిపై పెద్దగా చర్చే నడుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవన్ కల్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరస సినిమాలు ఒప్పుకొన్నారు. కానీ వాటిలో ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ మాత్రమే ఇప్పటివరకు థియేటర్లలోకి తీసుకొచ్చారు. గత రెండేళ్ల క్రితం స్టార్ట్ చేసిన ‘హరిహర వీరమల్లు’.. ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మరో 40-50 శాతం చిత్రీకరణ మిగిలుందని అంటున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ తో ‘OG’కూడా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజీలో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో హీరోయిన్ పూజాహెగ్డే పెట్టిన ఇన్ స్టా స్టోరీ వైరల్ గా మారింది.
ఎందుకంటే హీరోయిన్ పూజాహెగ్డే.. తన ఇన్ స్టా స్టోరీలో ‘న్యూ మూవీ.. న్యూ లుక్’ అని ఓ ఫొటో, ‘బ్యాక్ టూ OG’ అని మరో ఫొటో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ అలర్ట్ అయిపోయారు. కొంపదీసి పవన్ సినిమాలో హీరోయిన్ గా ఏం చేయట్లేదు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇక్కడ OG అంటే పవన్ సినిమా పేరు కాదు, ఒరిజినల్ గెటప్ అని ఆమె అభిప్రాయం అని తెలుస్తోంది. మరికొందరైతే ఫన్నీగా కూడా కామెంట్స్, మీమ్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా గతేడాది హరీష్-పవన్ కాంబోలో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ అనౌన్స్ చేసినప్పుడు అందులోనూ పూజానే హీరోయిన్ అని అన్నారు కానీ ఏది కన్ఫర్మ్ కాలేదు. మరి పవన్ ‘OG’లో పూజాహెగ్డే హీరోయిన్ అంటూ వస్తున్న రూమర్స్ పై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
OG anta 🤭😂😂#Poojahegde pic.twitter.com/wSJb7hScvR
— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) February 4, 2023