మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈమెకు టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో పెద్దఎత్తున అభిమాన సంఘాలు ఉన్నాయి.
తమన్నా అందం, అభినయం, డాన్స్ ఒకటేమిటి ఆమె ఏం చేసినా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు.
తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి ఫుల్ బిజీగా మారడం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో బీటౌన్‌లో మంచి హిట్ కొట్టేసింది.
అంతేకాకుండా బోలే చుడియాన్ అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ సందడి చేయనుంది.
సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. మలయాళంలో దిలీప్ 147 అనే సినిమా చేస్తోంది. ఇలా అన్ని భాషల్లో చేతినిండా సినిమాలతో ఫుల్ ఖుషీగా, బిజీగా ఉంది.
ఈ అమ్మడు అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటో షూట్లు, రీల్స్ అంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా గోల్డ్ కలర్ శారీలో క్లీవేజ్ చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిపోయేలా చేసింది.