భారత్-పాక్ టాపిక్ వచ్చినా ప్రతిసారి సోషల్ మీడియా మొత్తం షేకవుతుంది. మనపై ఏ విషయంలోనైనా సరే పైచేయి సాధించాలని చూస్తుంటారు. ఇక అదను దొరికితే ట్రోల్స్ చేయడానికి కూడా వెనుకాడరు. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో చూశాం కదా. అది ముగిసిందో లేదో.. ఇప్పుడు మరో విషయమై పాక్ వక్రబుద్ధి చూపిస్తోంది. పాక్ లో ఆర్ఆర్ఆర్ సినిమాపై కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అబద్ధాలు చెబుతూ సినీ ప్రేక్షకులను మాయ చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక ఈ మూవీని తన సినిమా బీట్ చేసిందని.. ఓ పాకిస్థాన్ ప్రొడక్షన్ హౌస్ ప్రచారం చేసుకుంటోంది. నిజంగానే ఆ సినిమా.. ఆర్ఆర్ఆర్ ని బీట్ చేసుండొచ్చు. కానీ ఆ విషయం పాక్ నిర్మాణ సంస్థ బయటకు చెప్పడం వాళ్లపై విమర్శలకు కారణమైంది.
ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ హీరోహీరోయిన్లుగా ‘ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జట్’ సినిమా తీశారు. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ ఆదరణ దక్కించుకుంటోంది. అయితే ఈ సినిమా.. యూకేలో ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ బాక్సాఫీస్ రెవెన్యూని 17 రోజుల్లో రాబట్టిందని పాక్ నిర్మాతలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇక పాక్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ ట్రిక్.. భారతీయ ప్రేక్షకులకు కోపం తెప్పించింది. క్రికెట్ లోనే కాదు సినిమాల విషయంలోనూ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం పక్కనబెడితే.. పాక్ సినీ ప్రేమికులు మాత్రం ‘ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జట్’ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. కంటెంట్ అదిరిపోయిందని, పాక్ ప్రజలు గర్వించదగ్గ చిత్రమని అంటున్నారు. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. యూకేలో ఆర్ఆర్ఆర్ రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. పాక్ మూవీ కలెక్షన్స్ మాత్రం బయటపెట్టలేదు. అయితే సెన్సార్ నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ పాక్ తీసిన ఓ మూవీని అంతర్జాతీయ తీసుకెళ్లడం గొప్ప విషయమే. కానీ భారతీయ చిత్రాన్ని తమది బీట్ చేసిందని చెప్పుకోవడం మాత్రం కరెక్ట్ కాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Another day, another achievement!
The Legend of Maula Jatt beats the highest grossing Indian movie of 2022, RRR’s lifetime business in just 17 days in UK! 🎊#TheLegendOfMaulaJatt in cinemas now, book your tickets today!#MaulaJatt2022 pic.twitter.com/OZfBYnmzOt— The Legend of Maula Jatt (@MaulaJattMovie) October 31, 2022
The Legend of Maula Jatt is a beast in UK. With every single day, It is surpassing the biggest releases of Indian Cinema in the United Kingdom.
Only #KGF2 and #PS1 are ahead of TLOMJ now. @MaulaJattMovie @AmmaraHikmat @blashari @GeoFilms_Geo @GoharRsd #LollywoodPictures pic.twitter.com/axN8xeChZc
— Lollywood Pictures 🇵🇰 (@LollyPictures) November 1, 2022