టాలీవుడ్ కి సంబంధించి రెగ్యులర్ గా ట్రోల్స్ ఫేస్ చేస్తున్న హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. ఇటీవలే జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హారర్ కామెడీ జానర్ లో చేసిన ఈ సినిమాలో విష్ణు సరసన సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ గా నటించారు. అయితే.. థియేట్రికల్ గా విడుదలైన జిన్నా సినిమా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ, జిన్నా సినిమాపైగానీ, మంచు విష్ణుపై గానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగడం లేదు. చాలా గ్యాప్ తర్వాత తన సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచు విష్ణు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ.. ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు.
జిన్నా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక కూడా విష్ణు సక్సెస్ జర్నీలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొని షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన సినిమా రిజల్ట్ గురించి, సోషల్ మీడియా ట్రోల్స్ గురించి స్పందించాడు. “ఢీ తర్వాత నా సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగు తీసినప్పటికీ, హిందీలో డబ్ అయిన నా సినిమాలకు యూట్యూబ్ లో, టీవీ ఛానల్స్ లో వ్యూయర్ షిప్, టీఆర్పీ రేటింగ్స్ బాగా రాబట్టాయి. ముఖ్యంగా నా సినిమాలలో డైనమైట్ మూవీ డబ్ అవ్వడమే కాకుండా టాప్ టిఆర్పీ రేటింగ్ తెచ్చుకుంది. అలాంటి వ్యూయర్ షిప్ ఇక్కడ వచ్చినా, జిన్నా మూవీని హిందీలో రిలీజ్ చేసినా రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టేవి” అని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. జిన్నా మూవీ రిలీజ్ అయినప్పటి నుండి టాక్ బాగానే ఉన్నా, కలెక్షన్స్ పరంగా కాస్త వెనకబడింది. ఇలాంటి సమయంలో మంచు విష్ణు.. రూ. 100 కోట్లు వసూల్ చేసేదంటూ మాట్లాడేసరికి, ట్రోలర్స్ ఆ మాటలను అవకాశంగా తీసుకుంటున్నారు. అలాగే మంచు విష్ణు మాటలపై నెట్టింట నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిన్నా సినిమాకు కోన వెంకట్ కథ అందించగా.. డెబ్యూ డైరెక్టర్ సూర్య సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను సొంత బ్యానర్ లో మంచు విష్ణునే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇక త్వరలోనే జిన్నా మూవీ ఫలితం ఎలా ఉన్నా.. దీనికి సీక్వెల్ ఉంటుందని కూడా చెప్పడం విశేషం.