టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మేజర్’. అ 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు విడిచిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ‘మేజర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘మేజర్’ మూవీ టీమ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ చేసిన ట్వీట్ కి మహేశ్ బాబు స్పందించారు.
‘మేజర్ సినిమా హార్ట్ టచింగ్ ఫిల్మ్. మ్యాన్ ఆఫ్ షో అడివి శేష్. అతని మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అయింది’ అని అల్లు అర్జు ట్వీట్ చేశాడు. ప్రకాశ్ రాజ్, రేవతి, సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ్లతో పాటు అందరూ ఆర్టిస్టులు చాలా బాగా నటించారని అన్నారు. డైరెక్టర్ శశికిరణ్ టిక్కా పనితనం చాలా బాగుందని. సినిమాను అద్భుతంగా రూపొందించారని బన్నీ మెచ్చుకున్నారు. ‘ప్రొడ్యూసర్ మహేశ్ బాబుకు బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసే సినిమా అందించారు. మేజర్: ప్రతి భారతీయుడి గుండెను తాకే కథ’ అంటూ బన్నీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: సింగర్ శ్రీరామ్ పై ఉషా ఉతుప్ ఆగ్రహం.. కాళ్లు పట్టుకున్నా కూడా..!
Big congratulations to the entire team of #MajorTheFilm. A very heart touching film . Man of the show @AdiviSesh does his magic once again. Impactful support by @prakashraaj ji , Revathi , @saieemmanjrekar, #SobhitaDhulipala & all artists . Mind blowing Bsm by @SricharanPakala
— Allu Arjun (@alluarjun) June 4, 2022
బన్నీ చేసిన ట్వీట్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించాడు. అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ మాటలు మేజర్ టీమ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నాడు. మేజర్ సినిమా అల్లు అర్జున్‌కు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ మహేశ్ బాబు ట్వీట్టర్ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. మరి.. వీరిద్దరి ట్వీట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thank you @alluarjun! Your words will surely encourage the young team of #Major. Happy to know that you loved the film ♥️ https://t.co/UVLHEQygcg
— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2022