చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ ప్రేక్షకుల కోసం ఏదైనా చేయాలనుకునే హీరోలు మాత్రం అరుదనే చెప్పాలి. అభిమానులను అలరించడానికి వారు ఎంతటి కష్టమైనా పడతారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ లో నటించేటప్పుడు కొన్ని సార్లు ప్రమాదాలకు కూడా గురౌతుంటారు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో నటించేటప్పుడు.. ఒకానొక సమయంలో నేను చనిపోతానని అనుకున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఆ సినిమా చేస్తున్న సమయంలో డిప్రెషన్ కు గురయ్యనని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హృతిక్ తెలిపాడు.
హృతిక్ రోషన్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా అతడికి పేరుంది. ఏ అమ్మాయినైనా నీకు ఎలాంటి భర్త కావాలి అంటే హృతిక్ అనే చెప్తారు. ఇక హృతిక్ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిక్స్ ప్యాక్, 8ప్యాక్ బాడీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు. అలాంటి హృతిక్ రోషన్ ఒకానొక సమయంలో చనిపోతానని అనుకున్నాడట. ఆ విషయాన్ని తాజాగా తన ఫిట్ నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ తో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హృతిక్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”నేను నా జీవితంలో ఎక్కువ కష్టపడ్డ సినిమా ‘వార్’. ఆ మూవీ కోసం శారీరకంగా అధికంగా కష్టపడటంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లినంత పనైంది. అదీకాక ఆ సమయంలో నేను చనిపోతానని అనుకున్నాను. అంతలా ఆ మూవీకి కష్టపడ్డా. అయితే ఆ చిత్రం కోసం నేను అప్పుడు సిద్దంగా లేను. దాంతో నా రోల్ కు తగ్గట్లుగా బాడీని మర్చుకోవడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది” అని హృతిక్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమా పూర్తి అయ్యేనాటికి నేను తీవ్రంగా అలసిపోయాను. కొన్ని నెలల వరకు ఎలాంటి శిక్షణ తీసుకోలేకపోయానని హృతిక్ అన్నారు. ఇక ట్రైనర్ క్రిస్ గెతిన్ శిక్షణ ఇచ్చిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. హృతిక్ నా దగ్గర 2013లో శిక్షణ తీసుకున్నాడు. 7 నెలల శిక్షణలో ఏ ఒక్కరోజు కూడా అతడు విరామం తీసుకోలేదు అని గెతిన్ తెలిపాడు. 2019 లో విడుదలైన ‘వార్’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం హృతిక్ ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నాడు.