వెరైటీ టేకింగ్‌తో సినిమాలు చేస్తూ ఉంటారు రవిబాబు.. తొలి సినిమా అల్లరి నుండే దర్శకత్వంలో కొత్తదనంతో కూడిన విధానాన్ని అవలంభిస్తున్నారు.ఈ సినిమా ద్వారానే చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకు నరేష్. ఈ సినిమాలో నటించిన హీరోయిన్..
విలక్షణంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు రవిబాబు. వెరైటీ టేకింగ్‌తో సినిమాలు చేస్తూ ఉంటారు. తొలి సినిమా అల్లరి నుండే దర్శకత్వంలో కొత్తదనంతో కూడిన విధానాన్ని అవలంభిస్తున్నారు రవిబాబు. ఫ్యామిలీ, సెంటిమెంట్, లవ్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ మూవీస్ తీయడంలో అతడి స్టైల్ డిఫరెంట్. తొలుత నటుడిగా పరిశ్రమలోకి వచ్చిన రవిబాబు.. అల్లరి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇతడిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయేలా చేశారు. వంశీ తరహా అడల్ట్ కామెడీ అందిస్తూ.. దూసుకెళ్లారు. ఈ సినిమా ద్వారానే చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకు నరేష్. ఈ సినిమా తర్వాతే ఆయన పేరు ‘అల్లరి నరేష్’గా స్థిరపడిపోయింది.
ఈ సినిమా ఇప్పుడు కూడా ఫ్రెష్ కామెడీ లుక్ కనిపిస్తుంది. ఈ సినిమాలో శ్వేత అగర్వాల్, నీలాంబరి అనే ఇద్దరు హీరోయిన్లు నటించారు. అయితే వీరిలో బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అప్పు అలియాస్ అపర్ణ. నరేష్ స్నేహితురాలిగా, అన్నింటిలో అతడికి హెల్ప్ చేస్తూ, మూగగా ప్రేమిస్తూ.. ఆ విషయం చెప్పలేక ఎంతో మదనపడుతుంది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా క్యూట్‌గా యాక్టింగ్ చేస్తూ మనల్ని మెప్పించింది. ఈ నటి పేరు శ్వేత అగర్వాల్. ఆ తర్వాత ప్రభాస్ సినిమా రాఘవేంద్రలో మహాలక్ష్మి పాత్రలో నటించింది ఈ చిన్నది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, బాలీవుడ్ సినిమాల్లో కనిపించింది.
కన్నడ నటుడు సుదీప్ పేరుకు ముందు కిచ్చా అనే పేరు రావడానికి కారణం ఆ పేరుతో సినిమా తీయడమే. ఆ సినిమా హీరోయిన్‌గా నటించింది శ్వేత. చివరిగా తెలుగులో 2008లో నరేష్, శర్వానంద్ మూవీ గమ్యం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. 2010లో బాలీవుడ్ హార్రర్ మూవీ చిత్రంలో కనిపించింది. ఆమె ఇప్పుడు వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ ఇంటి కోడలైంది. 2020లో ఉదిత్ నారాయణ్ కుమారుడు, సింగర్ ఆదిత్య నారాయణన్‌ను వివాహం చేసుకుంది. వీరికి 2022లో ఓ పాప జన్మించింది. ఆమెను ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. సోషల్ మీడియాలో కూడా తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎలా ఉందో ఆ ఫోటోలో చూడొచ్చు.