ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్.. ఇది మొన్నటి లెక్క. ఆస్కార్ ఫర్ ఆర్ఆర్ఆర్.. ఇది కొత్త లెక్క. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్.. ఇండియన్ సినీ చరిత్రలో కొత్త పునాది వేసింది. ఆస్కార్ గెలుపుతో నాటు నాటు యావత్ భారతీయుల మనసులు సైతం గెలుచుకుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటోంది. ఎవరి వల్ల కానిది.. రాజమౌళి చేసి చూపించాడు.. సాధించాడు!
‘ఆర్ఆర్ఆర్‘ ఫర్ ఆస్కార్.. ఇది మొన్నటి లెక్క. ఆస్కార్ ఫర్ ఆర్ఆర్ఆర్.. ఇది కొత్త లెక్క. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటోంది. అందుకు కారణం.. అచ్చతెలుగు నాటు పాట. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్.. ఇండియన్ సినీ చరిత్రలో కొత్త పునాది వేసింది. 95వ ఆస్కార్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ‘నాటు నాటు’ అవార్డు గెలిచింది. ఆస్కార్ గెలుపుతో నాటు నాటు యావత్ భారతీయుల మనసులు సైతం గెలుచుకుంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? పాటకట్టిన ఎంఎం కీరవాణి, రాసిన చంద్రబోస్, డ్యాన్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లే ప్రధాన కారణమా? మాకు తెరపై వీళ్ళే కనిపిస్తున్నారని అనిపించవచ్చు.
అవును.. వాళ్లే. కానీ.. వాళ్లందరినీ నడిపించిన నాయకుడు రాజమౌళిది అసలు విజయం. ఆస్కార్.. అనేది ఒకరిద్దరి కల కాదు. ఖచ్చితంగా సినిమా టీమ్ అందరి కల.. ఆస్కార్ వరకు చేరుకున్నాక దేశం కల. అయినా.. వీటన్నింటి వెనకున్న మోటివ్ ఎవరిది.. దర్శకుడు రాజమౌళిది. ఒక దర్శకుడు కన్న కల.. తన విజన్ తో చూసిన సినిమా.. ఆ సినిమాలో తెలుగువాడి సత్తా చాటుతూ రూపొందిన పాట.. ఆ పాటకు సంగీతం.. ఆ సంగీతానికి సరిపడే డ్యాన్స్.. ఆ డ్యాన్స్ కి ప్రపంచ దేశాల ఆడియెన్స్ అంతా ఊగిపోవాలనే ఐడియా దర్శకుడికే చెందుతుంది. వేరే సినిమాల సంగతి పక్కన పెడితే.. రాజమౌళి సృష్టించిన ప్రపంచం ఇది.
ఆర్ఆర్ఆర్.. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా. ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియా స్టార్స్ ని చేసిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లు కొల్లగొట్టిన సినిమా.. ఇప్పుడు ఇండియా నుండి ఆస్కార్ కొట్టిన సినిమా కూడా అదే. రాజమౌళి విషయంలో హీరోలకంటే.. ఆయన సినిమాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. రాజమౌళి పేరు కనిపిస్తే చాలు.. అందులో ఎవరెవరు నటించారు? అనేది పట్టించుకోకుండా థియేటర్స్ కి పరిగెత్తే ఎమోషన్ ని ఆడియెన్స్ లో క్రియేట్ చేశాడు. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్.. ఒక్కో సినిమాతో తన స్థాయిని కాదు.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతున్న ఘనత రాజమౌళిది.
ఆర్ఆర్ఆర్.. 95వ ఆస్కార్స్ లో అవార్డు సాధించి.. ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రమే కాదు.. దేశం గర్వపడేలా చేసింది. ఆస్కార్ కోసం.. ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ వరకు చేర్చడం వెనుక.. దర్శకుడు రాజమౌళి కృషిని ఎవరూ వెలకట్టలేరు. గొప్ప కథలన్నీ గొప్ప సినిమాలు కాకపోవచ్చు.. కానీ, ప్రపంచం గొప్పగా ఆదరించిన సినిమాలో అన్ని విషయాలు గొప్పవే. ఆర్ఆర్ఆర్ లో కథ, పాటలు, ఎమోషన్స్.. యాక్షన్స్.. ఇలా ప్రతిదీ గొప్పదే. ఆ గొప్పతనం ఆస్కార్ లాంటి బిగ్ స్టేజ్ పై రిఫ్లెక్ట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు. అయినా.. ఆర్ఆర్ఆర్ మనకు గొప్పది. ఎందుకంటే.. అది ప్రపంచాన్ని ఆకట్టుకుంది.. అన్నింటికీ మించి అది రాజమౌళి సినిమా.
రాజమౌళి ఒక్కో సినిమాకు సమయం ఎక్కువ కేటాయిస్తాడేమో.. కానీ, ఆయన కష్టం ఎన్నడూ వృథా కాలేదు. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ప్రూవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. డైరెక్టర్ గా తాను ఎదగడమే కాదు.. ఇండియన్ సినిమాకి.. ముఖ్యంగా తెలుగు సినిమా ఎదుగుదలకి రాజమౌళి కృషి చేస్తున్నాడు. గొప్ప కలలు ఎప్పుడూ గొప్ప ఫలితాలనే తెస్తాయి.. అనడానికి రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ ఒక నిదర్శనం. ఇది అందరి వల్ల అయ్యే పని కాదు. ఒక సినిమాని తెరకెక్కించి.. అది హిట్టా ఫట్టా.. నెక్స్ట్ ఏంటి? అనే రోజులివి. అలాంటిది సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యాక దాన్ని వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేసి.. గొప్ప గొప్ప అవార్డులతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నాలు ఎంతమంది చేస్తున్నారు? కానీ రాజమౌళి చేసి చూపించాడు.. సాధించాడు! ఇండియాకి ఆస్కార్ ని తెచ్చాడు.. అందుకోసమైనా రాజమౌళి.. నీకిదే మా హ్యాట్సాఫ్!
S.S.Rajamouli Reaction After Winning the Oscar Award For #NaatuNaatu 🔥#OscarForNaatuNaatu #RRRMovie #Tollywood #SumanTVpic.twitter.com/tasoKZPQq0
— SumanTV (@SumanTvOfficial) March 13, 2023
#NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳
Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe
— Abhi (@abhi_is_online) March 13, 2023