తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో విడుదలైన పుష్ప సినిమాతో ఆయన కాస్త పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. కాగా బన్నీ తన నటనతో టాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా ఎంతో మంది అభిమానఘనాన్ని కూడగట్టుకున్నారనే చెప్పాలి. అయితే ఈ ఐకానిక్ హీరో కాస్త బ్రేక్ దొరికినప్పుడల్లా ఖచ్చితంగా తన ఫ్యామిలీతో సరద సరదగా గడుపుతుంటాడు.
ఇది కూడా చదవండి: సరిగమప షో నుంచి సింగర్ పార్వతి ఎలిమినేటెడ్.. షాక్ లో ఫ్యాన్స్!
ఇక బన్నీ భార్య స్నేహారెడ్డి సైతం అప్పుడప్పుడు తన భర్తతో గడిపిన క్షణాలను, తిరిగిన ప్రదేశాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా బన్నీ భార్య స్నేహారెడ్డి తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇన్ స్టాగ్రాంలో ఆస్క్ మీ ఎనీ థింగ్ అంటూ పెట్టేసింది. ఇందులో భాగంగా బన్నీ సీక్రేట్స్ సైతం కొన్నిబయటపెట్టేసింది స్నేహారెడ్డి. బన్నీకి బిర్యానీ అంటే ఇష్టమట, తనకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, అలాగే ప్రదేశాల్లో లండన్ అంటే ఇష్టమని తెలిపింది. ఇక ఈ మధ్య సెర్బియాలో సందడి చేసిన ఫోటోలను కూడా చూపించింది స్నేహారెడ్డి .
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.