పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల, ప్రీరిలీజ్ ఈవెంట్ ఇలా ఏదైనా సరే అభిమానులు హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అభిమానులను తలదన్నే రేంజ్ లో హడావుడి చేస్తారు నిర్మాత బండ్ల గణేష్. పవన్ కల్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కల్యాణ్ సినిమా వేడకల్లో బండ్ల గణేష్ చేసే ప్రసంగాలకు ప్రత్యేక అభిమానులున్నారంటే అతశయోకి కాదు. ఆయన మాటల తూటాలకు పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అతని పొగడ్తల వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్న కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు.
ఈ క్రమంలో పవన్ భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. పవన్ కల్యాణ్ ని మా దేవర అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు బండ్ల గణేష్. చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించాడు. ‘మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .. చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర.. ’ అంటూ భీమ్లా నాయక్ సినిమా మీద బండ్ల గణేష్ పవర్ ఫుల్ ట్వీట్ చేశాడు. ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది.
మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ … 🙏
చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర @PawanKalyan 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅 pic.twitter.com/lVGITxiMnr— BANDLA GANESH. (@ganeshbandla) February 24, 2022
ఇది కూడా చదవండి : స్టార్స్ చాలా మంది ఉంటారు..కానీ- భీమ్లా నాయక్ ఈవెంట్ లో కేటీఆర్
ప్రస్తుతం బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే భీమ్లా నాయక్ ఈవెంట్లో బండ్ల గణేష్ కనిపించలేదు. ఈ క్రమంలో బండ్ల గణేష్ పేరు మీదుగా లీకైన ఆడియో సంచలనంగా మారింది. అందులో త్రివిక్రమ్ మీద చేసిన ఆరోపణలు, వాడిన పదజాలం దారుణంగా ఉంది. దాంతో వీరిద్దరి మధ్య వివాదాలున్నట్లు అభిమానులు భావస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.