నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్త్ను టాక్ షో ‘‘ అన్‌స్టాపబుల్’. ఈ షో సీజన్ వన్ దిగ్విజయంగా ముగిసింది. సీజన్ వన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హోస్ట్‌గా బాలయ్య బాబు అదరగొట్టేశారు. షోను మరో లెవల్‌కు తీసుకెళ్లిపోయారు. ఇది బాలయ్యకు మొదటి టాక్ షో అయినప్పటికి అలా అనిపించకుండా చూసుకున్నారు. గెస్ట్‌లతో కూడా వ్వావ్ అనిపించారు. తాజాగా, అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదలైంది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ గెస్ట్‌లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
ఎంతో సరదాగా ఈ ఎపిసోడ్ ముగిసింది. ఎసిసోడ్ 2కు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నల గడ్డ వచ్చారు. తాజాగా, మూడో ఎపిసోడ్ గెస్ట్‌లుగా శర్వానంద్, అడవి శేషు వచ్చారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలో హీరో సిద్ధార్ధ్, హీరోయిన్ అతిధి రావు హైదరీ రిలేషన్‌పై శర్వానంద్‌ను బాలయ్య ఓ ప్రశ్న వేశారు. ‘‘ అదితి రావు హైదరి సంగతేంటి?’’ అని బాలయ్య అడిగారు. అందుకు శర్వానంద్ సమాధానం ఇస్తూ..‘‘ ఆవిడ ‘మహాసముద్రం’ లో నాకు జంటగా నటించలేదు. సిద్ధార్థ్ కు జంటగా నటించింది’’ అని సమాధానం ఇచ్చాడు.
దానికి బాలయ్య ‘‘రియల్ లైఫ్ లో కూడా ఆమె సిద్దార్థ్ కు జంటగా మారిందా?’’ అని మరో ప్రశ్న సంధించారు. దానికి శర్వానంద్ ‘‘ నాకు తెలీదు.. సిద్ధూ తన ‘ఇంస్టాగ్రామ్ లో ‘హృదయపూర్వక యువరాణి’ అని కామెంట్ చేశాడు. అందువల్ల నేను ఇలా మాట్లాడుతున్నా’’ అని బదులిచ్చాడు. ‘‘అంటే పలికిందంటావా’’ అని బాలయ్య అడగ్గా.. దానికి శర్వానంద్ ‘‘ఏమో పలికిందేమో’’ అని అరకొర సమాధానం ఇచ్చాడు. కాగా, సిద్ధార్ధ్, అతిధి రావు హైదరీ ప్రేమలో ఉన్నారన్న వార్తలు గతకొద్ది రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అయితే, దీనిపై ఆ ఇద్దరినుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.